Ananya panday : అనన్య పాండే తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న 'లైగర్'లో హీరోయిన్గా చేస్తోంది. అది అలా ఉంటే అనన్య పాండే ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె నాన్నమ్మ కన్నుమూశారు. ఈ నేపధ్యంలో అంత్యక్రియలకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనన్య పాండే తండ్రి చంకీ పాండే అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. తన తల్లి స్నేహలతా పాండేకు చంకీ పాండే తలకొరివి పెట్టారు. ఇక అనన్య పాండే నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఈ భామ 'స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2' అదరగొట్టింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది. ఇక లైగర్ విషయానికి వస్తే.. ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీలో కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో విడుదల చేయనున్నారు.
View this post on Instagram
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. కాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ రూమర్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన యాక్షన్ సీన్ లో పాపులర్ ఇంటర్ నేషనల్ బాక్సర్ నటించనున్నారని తెలిసిందే. అందులో భాగంగా అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ను తీసుకున్నారని సమాచారం.
@ananyapandayy at her grandmother’s last rites today??
.
.#ananyapanday pic.twitter.com/oZEkxyVP7o
— InstantBollywood (@instantbolly) July 10, 2021
ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. ఈ సినిమాకు మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. లైగర్ సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ananya Panday, Vijay Devarakonda