బన్నీ, చరణ్ భామలకు చెక్ పెడుతున్న విజయ దేవరకొండ హీరోయిన్..

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో లైగర్ పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: April 21, 2020, 3:17 PM IST
బన్నీ, చరణ్ భామలకు చెక్ పెడుతున్న విజయ దేవరకొండ హీరోయిన్..
ఇప్పుడు హాట్ స్టార్‌లో విడుదలైన సినిమా కూడా చెత్త అంటూ తీసి పారేస్తున్నారు. ఇప్పుడు ఖాళీ పీలి సినిమాకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అనన్య పాండే, ఇషాన్ కట్టర్ జంటగా వచ్చిన ఈ సినిమా ట్రైలర్‌కు కూడా డిస్ లైకుల వర్షం కురుస్తుంది.
  • Share this:
పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో లైగర్ పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరీ, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీలో కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరించనున్నాడు. దాదాపు ఓ 40 రోజుల పాటు ముంబైలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుత కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో విడుదల చేయనున్నారు. అయితే మొదటినుండి ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్‌గా చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఏవో కారణాల వల్ల హీందీ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండేను విజయ్‌కు జోడిగా ఎంచుకుంది చిత్రబృందం. అనన్య పాండే గతంలో రెండు సినిమాలు చేసింది. స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2 సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అనన్య ఆ తర్వాత 'పతి పత్ని ఔర్ వో' సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టరయినా కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది అనన్య. అది అలా ఉంటే ఈ సినిమాతో తెలుగు వారికి పరిచయమవుతోన్న అనన్యకు అప్పుడే టాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయట. ఇక్కడి యువ హీరోలు ఆమెను రికమెండ్ చేస్తున్నారట. అందులో భాగంగా ఈ భామకు అడ్వాన్స్‌లు ఇవ్వడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాదు స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదని టాక్. దీంతో వరుస విజయాలు అందుకుంటూ ఊపేస్తోన్న రష్మిక మందన, పూజా హెగ్డేలకు ఈ భామ గట్టిపోటీ ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
Published by: Suresh Rachamalla
First published: April 17, 2020, 7:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading