పూరీ, విజయ్ దేవరకొండ సినిమాలో బాలీవుడ్ క్రేజీ భామ..

రీసెంట్‌గా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో ప్రేక్షకులను అంతగా మెప్పించ లేకపోయినా విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం తన ఆశలన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘ఫైటర్’ సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండేను ఫిక్స్ చేసారు.

news18-telugu
Updated: February 20, 2020, 2:06 PM IST
పూరీ, విజయ్ దేవరకొండ సినిమాలో బాలీవుడ్ క్రేజీ భామ..
విజయ్ దేవరకొండ సరసన ఛార్మి (Twitter/Photo)
  • Share this:
రీసెంట్‌గా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో ప్రేక్షకులను అంతగా మెప్పించ లేకపోయినా విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం తన ఆశలన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘ఫైటర్’ సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో పాటు హిందీలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోయిన్‌నే తీసుకోవాలని ముందు నుంచి వినిపిస్తున్న మాట. ముందుగా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్‌ను అనుకున్నారు. కానీ ఫైనల్‌గా మాత్రం ఈ చిత్రంలో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో పరిచయమైన అనన్యా పాండేను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ విషయాన్ని చిత్ర యూనిట్  కన్ఫామ్ చేస్తూ విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మిలతో కలిసి ఉన్న అనన్యా పాండే ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు.



ఈ చిత్రాన్ని తెలుగు,హిందీతో పాటు మిగతా భాషల్లో రిలీజ్ చేయాలనే ఫ్లాన్‌లో ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ మాదిరే ఈ సినిమాను కూడా పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరీ, చార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీలో కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ చిత్రం. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది ఫైటర్. మరి ఈ చిత్రంతో పూరీ, విజయ్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 20, 2020, 2:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading