హోమ్ /వార్తలు /సినిమా /

Ananya Nagalla : వకీల్‌సాబ్ భామ అనన్య నాగళ్ల విడుదల చేసిన ‘ఏవమ్ జగత్’ చిత్రంలోని రాధాస్ లవ్ సాంగ్..

Ananya Nagalla : వకీల్‌సాబ్ భామ అనన్య నాగళ్ల విడుదల చేసిన ‘ఏవమ్ జగత్’ చిత్రంలోని రాధాస్ లవ్ సాంగ్..

అనన్య నాగళ్ల విడుదల చేసిన ‘ఏవమ్ జగత్’ పాట (Twitter/Photo)

అనన్య నాగళ్ల విడుదల చేసిన ‘ఏవమ్ జగత్’ పాట (Twitter/Photo)

Ananya Nagalla : టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ భామ ‘ఏవం జగత్’ మూవీ నుంచి ఓ సాంగ్‌ను విడుదల చేసారు.

  Ananya Nagalla : టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ నుండి వచ్చిన ఈ తెలుగమ్మాయి అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ‘వకీల్‌సాబ్’ సినిమాలో దివ్య నాయక్ పాత్రలో అదరగొట్టింది. ‘వకీల్ సాబ్’ సినిమాతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఈమెతో చేయిస్తున్నారు. తాజాగా వకీల్ సాబ్ భామ..  కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో దినేష్ నర్రా దర్శకత్వంలో మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్న  'ఏవం జగత్’ (Aevum Jagat)సినిమాకు సంబంధించిన ‘రాధాస్(Radhas) సాంగ్‌ను విడుదల చేసారు.

  " ఉదయించే సూర్యిడిలా ..ప్రతిరోజు నిను చూసా ..జనియించిందే ..ఒక స్వప్నం.. "

  అనే పల్లవితో సాగిన మంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ ఇది. శివ కుమార్ మ్యూజిక్ అందించగా సందీప్ కూరపాటి, సమీరా భరద్వాజ్ ఆలపించారు. ఈ పాటను విడుదలచేసిన సందర్బంగా అనన్య నాగళ్ళ చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

  ప్రపంచీకరణ నేపధ్యంలో ఎన్నో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది తమ సొంత ఊర్లు విడిచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. దీని వల్ల నిజంగా మన దేశం అభివృద్ధి చెందిందా..? మన కలాం గారి కల, మిషన్ 2020 నెరవేరిందా..? ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న సినిమా ‘ఏవమ్ జగత్’.

  Maa Elections - Prakash Raj : మా అధ్యక్షుడిగా పోటీ చేస్తోన్న ప్రకాష్ రాజ్ పై సీనియర్ సభ్యుల అసహనం..

  ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ...వ్యవసాయం భవిష్యత్తు ఏంటి..? రాబోయే తరానికి కావలసిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగు భూమి కానీ, పండించగల అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా..? అనే అంశాలను ప్రధానంగా 'ఏవం జగత్' మూవీలో చూపిస్తున్నట్టు చెప్పారు.

  Ashwini Dutt - K Raghavendra Rao : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, దర్శకుడు కే రాఘవేంద్రరావు టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్..

  వ్యవసాయం మరియు మానవ సంబంధాలతో ముడిపడి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక 20 ఏళ్ల యువకుడి కథే 'ఏవం జగత్'. ఒక పల్లెటూరిలో సాగే ఈ కథలో, దేశ పరిస్థితులను, పురోగతికి అద్దం పట్టేలా కథా కథనాలు సాగుతాయన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించడంలో కమల్ ఎలాంటి ప్రయత్నం చేశాడనేది ఈ  చిత్రలో ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ananya Nagalla, Tollywood, Vakeel Saab

  ఉత్తమ కథలు