Karthika Deepam: అంజికి నీకు సంబంధం ఏంటి.. నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడా.. మోనితకు ఏసీపీ రోషిణి షాక్!

karthika deepam

Karthika Deepam: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళుతోంది. కథ ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు టీవీల ముందే వాలిపోతున్నారు. ఇక మోనితకు రోషిణి నుండి ఫోన్ వస్తుంది.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళుతోంది. కథ ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు టీవీల ముందే వాలిపోతున్నారు. ఇక మోనితకు రోషిణి నుండి ఫోన్ వస్తుంది. అంతలోనే దీప అక్కడికి రావడంతో మోనిత తన భయాన్ని బయట పెట్టకుండా ధైర్యంగా ఉన్నట్లు మాట్లాడుతుంది. కాని దీప మాత్రం మోనిత నాటకాన్ని తెలుసుకుంటుంది. అంతలోనే రోషిణి మళ్ళీ ఫోన్ చేసి ఫైర్ అవుతుంది. ఇక వెంటనే దీపకు వార్నింగ్ ఇస్తూ బయలుదేరగా.. దీప చిటికలు వేసి వెళ్తున్నాను కాదు వెళ్తున్నాం అని.. పైగా అక్కడ అంజి ఉన్నాడు దుర్గా ఉన్నాడు అనడంతో మోనితను తెగ బయపెట్టిస్తుంది. మరోవైపు పిల్లలు మొక్కలు నాటుతూ.. కార్తిక్ కు చూపిస్తూ ఈ పువ్వులు పూసే వారికి అమ్మ గుడ్ న్యూస్ చెబుతుందని అంటారు.

    కార్తీక్ తన మనసులో పిల్లలకు నిజం తెలియకముందే అంజిని పట్టించాలని అనుకుంటాడు. ఇక ఆనందరావు జరిగింది తలుచుకుంటూ నా పెద్ద కొడుకు తో మాట్లాడాలి రా అని ఆదిత్యతో అంటాడు. ఇక మోనిత, దీప రోషిణి ఇంటికి వెళ్లగానే వెంటనే రోషిణి.. నిన్ను పిలవలేదు కదా అని దీపని అంటుంది. ఇక మోనిత దీప అబద్ధం చెప్పిందని షాకవుతుంది. రోషిణి అంజి గురించి విచారించగా టెన్షన్ పడుతుంది మోనిత. ఇక కార్తీక్ పిల్లలు తీసుకొని తన తండ్రి దగ్గరికి తీసుకెళతాడు. ఇక ఆనందరావు నిన్ను చాలా మాటలు అన్నాను అంటూ.. నీ కంటే ఎక్కువ నాకే బాధగా ఉందని.. దీప నిజంగా దీపమే అంటూ.. నీకు వెలుగులా ఉంది అంటూ.. అవకాశం దొరికిన నిన్ను అవమానించడం లేదు అంటూ కార్తీక్ తో దీప గొప్పతనాన్ని చెబుతాడు. ఇక కార్తీక్ పిల్లల్ని దీపను ప్రాణంగా చూసుకుంటానని, నువ్వు నమ్మితే చాలు అని అనడంతో ఆనందరావు నమ్మినట్లుగా కనిపిస్తాడు.

    మోనిత తన భయాన్ని బయట పెట్టకుండా ధైర్యంగా కనిపిస్తుంది.రోషిణి మాత్రం అంజి గురించి బాగా విచారిస్తుంది. అంజి గురించి నీకు ఎలా తెలుసు అని ప్రశ్నిస్తుంది. వెంటనే మోనిత అంజి గురించి పెద్దగా పరిచయం లేదు అంటూ కంగారు పడుతూ స్పందిస్తుంది. దాంతో రోషిణి ఏం పరిచయం లేనిదే రిజిస్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసి పెళ్లి ఆపించేస్తాడా అని ప్రశ్నిస్తుంది. అంజి నిన్ను ప్రేమించాడా అని అనగా.. ఛీ ఛీ అని విరుచుకుపడుతుంది. పోనీ పెళ్లి చేసుకుందామనుకున్నారా అని అనడంతో మళ్లీ అదే విధంగా అంటూ డ్రైవర్ తో నాకు ప్రేమ పెళ్లి ఏంటి అని అంటుంది మోనిత. ఇక రోషిణి మాత్రం తన ప్రశ్నలతో మోనితకు చెమట పట్టిస్తుంది. ఇక ప్రోమోలో దీప కార్తీక్ ని మోనిత ఇంటికి తీసుకెళ్లి షాక్ ఇస్తుంది. అంజి గురించి మాట్లాడుతూ మోనిత ను ఓ ఆట ఆడుకుంటుంది. మొత్తానికి మోనిత ఇన్ని రోజులు ఇచ్చిన ట్విస్ట్ లే మళ్లీ మోనితకు తగిలేలా ఉన్నాయి.
    Published by:Navya Reddy
    First published: