సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో వచ్చిన మహేష్ బాబు.. బాక్సాఫీస్ వద్ద మరో హిట్ కొట్టాడు, ఈ సినిమా స్టోరీ, పాటలు ఓ ఎత్తైతే,. అందులో మహేష్ బాబు(Mahesh Babu) లుక్ మరో ఎత్తు. ఈ సినిమాలో మహేష్ బాబు మరింత హ్యాండ్ సమ్‌గా కనిపించాడు. మహేష్ లుక్కు అమ్మాయిలు ఫిదా అయిపోయారు. 40 ప్లస్ ఏజేలో కూడా ఇంత అందంగా ఎలా మెంటైన్ చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదంటున్నారు. ఇక మహేష్‌ను కూడా చాలా ఇంటర్వ్యూలో యాంకర్లంతా ఇదే ప్రశ్నలు వేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా మహేష్ బాబుపై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర(Anand Mahindra) ట్వీట్ చేశారు.
సాధారణంగా ఆనంద్.. సోషల్ మీడియా(Social Media)లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఏదో ఒకటి ట్వీట్ చేస్తూనే ఉంటారు. ఈసారి మాత్రం ఆయన చేసిన ట్వీట్ మహేష్ బాబుపై కావడం విశేషం. ఎప్పుడూ సామాజిక సమస్యలపై ట్వీట్లు చేసే ఆయన ఈసారి ప్రముఖ సౌత్ ఇండియన్ నటుడు మహేష్ బాబు గురించి ట్వీట్ చేశారు. తన ట్వీట్లో, జావాపై మహేష్ బాబు రైడ్ గురించి ప్రస్తావించారు మహీంద్రా. ఆనంద్ మహీంద్రా తన ట్వీట్లో 'మహేష్ బాబు జావా అద్భుతమైన కాంబినేషన్‌ని చూడకుండా ఎలా ఉండగలను? ప్రస్తుతం నేను న్యూయార్క్‌లో ఉన్నాను. త్వరలో షూటింగ్ జరుగుతున్న న్యూజెర్సీకి వెళతానని అన్నారు. మహీంద్రా చేసిన ఈ ట్వీట్‌కు మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి లైక్‌లు, రీట్వీట్స్ వస్తున్నాయి.
ఆనంద్ మహీంద్రా తన ట్వీట్లో పేర్కొన్న జావా మోటార్‌సైకిల్ నిజానికి మహీంద్రా & మహీంద్రా బ్రాండ్ బైక్. దాదాపు 44 ఏళ్ల తర్వాత.. కొన్ని సంవత్సరాల తరువాత ఈ బైక్ ఇండియాకు వచ్చింది. ఇప్పుడు జావా మోటార్‌సైకిళ్లు మహీంద్రా & మహీంద్రా కంపెనీకి అనుబంధంగా ఉన్న క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అమ్మకాలు జరుగుతున్నాయి.ఇక సర్కారు వారా పాట సినిమాలో.. సెకండాఫ్‌లో మనకు మహేష్ ఈ బైక్ నడుపుతూ కనిపిస్తాడు. ఫస్ట్ ఆఫ్ అంతా అమెరికాలో జరుగుతంది. ఇక సెకండాఫ్‌లో వైజాగ్ వచ్చిన మహేష్ జావా బైక్‌పై తిరుగుతూ మనకు కనపిస్తాడు. దానికి సంబంధించిన వీడియోను కూడా ఆనంద్ మహింద్రా తన ట్వీట్లో పోస్టు చేశారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.