Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్ట్.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హైవే!

ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం (anand devarkonda pushpaka vimanam)

దొరసాని సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ.. ప్రస్తుతం 'హైవే' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వం వహించాడు.

  • Share this:
    దొరసాని సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ.. ప్రస్తుతం 'హైవే' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన మానస రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు వెంకట తలారి నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు. ఈ సినిమా సైకో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై రూపొందుతుంది.

    ఇక ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందడమే కాకుండా ఈ సినిమాకు భారీ అంచనాలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సినీ బృందం ఒక పోస్టర్ వదిలారు. అందులో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ మానస రాధాకృష్ణన్, డైరెక్టర్ గుహన్, నిర్మాత వెంకట్ ఈ సినిమా పూర్తయిందని ఓ సింబాలిక్ గా తెలిపారు.

    ఈ సినిమా షూటింగును ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో మంచి లొకేషన్ లలో చేశారట. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా డైరెక్టర్ గుహన్ కొన్ని విషయాలు తెలిపాడు. హైవే నేపథ్యంలో సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపాడు. ఇక ఈ సినిమాకు బాగా ట్విస్టులు ఉన్నాయని అవి చాలావరకూ ప్రేక్షకులను మెప్పిస్తాయని తెలిపాడు.

    అంతేకాకుండా ఈ సినిమా టెక్నికల్ గా కూడా ముందుగానే ఉందని త్వరలోనే ఈ సినిమా గురించి మరికొన్ని విషయాలు పంచుకుంటామని తెలిపాడు. ఇక నిర్మాత వెంకట్ కూడా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమాకు అప్పుడే ప్రశంసలు వస్తున్నాయని తెలిపాడు. ఈరోజు ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపాడు. ఈ సినిమాలో నటించిన పలువురు నటీనటుల పేర్లు త్వరలోనే తెలుపుతామని ప్రకటించాడు. ఇక ఈ సినిమా షూటింగ్ అద్భుతమైన లొకేషన్ లలో జరిగిందని తెలిపాడు. దీనిని బట్టి చూస్తే ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకోనున్నాడని అర్థమవుతుంది.
    Published by:Rekulapally Saichand
    First published: