Home /News /movies /

ANAND DEVARAKONDA NEXT MOVIE TITLED AS PUSHPAKA VIMANAM PRODUCED BY SENSATIONAL VIJAY DEVARAKONDA PK

Anand Devarakonda Pushpaka Vimanam: ‘పుష్పక విమానం’ ఎక్కిన ఆనంద్ దేవరకొండ.. క్లాసిక్ టైటిల్‌తో కుస్తీ..

ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం (anand devarkonda pushpaka vimanam)

ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం (anand devarkonda pushpaka vimanam)

Anand Devarakonda Pushpaka Vimanam: దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి గతేడాది 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో గుర్తింపు సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాతో అందుకున్న విజయంతో ఈయన కాన్ఫిడెన్స్ మరింత..

ఇంకా చదవండి ...
దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి గతేడాది 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో గుర్తింపు సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాతో అందుకున్న విజయంతో ఈయన కాన్ఫిడెన్స్ మరింత ఎత్తుకు చేరిపోయింది. హిట్ రాగానే కమర్షియల్ జోనర్‌లో వెళ్ళాలనే ప్లాన్స్ లేకుండా హాయిగా సింపుల్ పాత్రలు చేస్తున్నాడు ఆనంద్. ఈయన మూడో సినిమాకు "పుష్పక విమానం" అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ఆనంద్. దామోదర అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ సినిమాని 'కింగ్ అఫ్ ది హిల్' ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి , ప్రదీప్ ఎర్రబెల్లిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ దామోదర మాట్లాడుతూ.. ఈ కథని న్యూస్‌లో చూసి ఇన్‌స్పైర్ అయి దానికి నిజజీవిత క్యారెక్టర్స్‌ని జోడించి తయారు చేసుకున్నాను. మొదట ఈ కథని విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్‌కు చెప్తే ఆయనకి బాగా నచ్చడంతో ఈ కథని నేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు. అదే టైంలో ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమా రిలీజ్ అవడంతో ఈ కథకి అతను అయితే బావుంటాడని అనుకుని ఆనంద్ దేవరకొండ హీరో గా ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్‌గా కనిపించనున్నాడు.

anand deverakonda pushpaka vimanam movie,anand devarakonda,pushpaka vimanam,anand devarakonda movies,vijay devarakonda,pushpaka vimanam movie motion teaser,anand devarakonda new movie first look,anand deverakonda new movie,anand devarakonda upcoming movies,anand devarakonda news,ఆనంద్ దేవరకొండ,ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం సినిమా
ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం (anand devarkonda pushpaka vimanam)


ఈ కథ ప్రధానంగా మధ్య తరగతి కుటుంబాలలో ఉండే డ్రామాని గుర్తు చేస్తూ.. పెళ్లి చుట్టూ ఉండే పరిస్థితులని చూపెడుతుంది. ఇందులో ఆనంద్ దేవరకొండతో పాటు సునీల్, సీనియర్ నరేష్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. శాన్వి మేఘన, గీత్ సాయిని ఇందులో హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఇది ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం. అందర్నీ అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ అవుతుందని తెలిపాడు.

anand deverakonda pushpaka vimanam movie,anand devarakonda,pushpaka vimanam,anand devarakonda movies,vijay devarakonda,pushpaka vimanam movie motion teaser,anand devarakonda new movie first look,anand deverakonda new movie,anand devarakonda upcoming movies,anand devarakonda news,ఆనంద్ దేవరకొండ,ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం సినిమా
ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం (anand devarkonda pushpaka vimanam)


ఇదిలా ఉంటే ఒకప్పుడు కమల్ హాసన్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ పుష్పక విమానం. ఈ మూకీ చిత్రానికి అప్పట్లో విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాంటి టైటిల్‌తో ఇప్పుడు ఆనంద్ సినిమా చేస్తున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anand Devarakonda, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు