ANAND DEVARAKONDA MIDDLE CLASS MELODIES MOVIE TRAILER RELEASED BY VIJAY DEVARAKONDA RASHMIKA MANDANNA PK
Middle Class Melodies trailer: జూనియర్ దేవరకొండ మిడిల్ క్లాస్ బతుకు పోరాటం..
ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్ (Middle Class Melodies trailer)
Middle Class Melodies trailer: దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన నటుడు ఆనంద్ దేవరకొండ. విజయ్ దేవరకొండ తమ్ముడిగా వచ్చినా కూడా తనకంటూ గుర్తింపు కోసం చూస్తున్నాడు ఈ కుర్రాడు. అందుకే రెండో సినిమా చాలా సైలెంట్‌గా..
దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన నటుడు ఆనంద్ దేవరకొండ. విజయ్ దేవరకొండ తమ్ముడిగా వచ్చినా కూడా తనకంటూ గుర్తింపు కోసం చూస్తున్నాడు ఈ కుర్రాడు. అందుకే రెండో సినిమా చాలా సైలెంట్‌గా పూర్తి చేసాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే ఎంటర్టైనర్తో వస్తున్నాడు ఇప్పుడు. మిడిల్ క్లాస్ అనే మాటలోనే చాలా మీనింగ్ ఉంది. తమ కథలో కూడా అంతే అర్థం ఉంటుందంటున్నాడు కొత్త దర్శకుడు వినోద్. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. భారత దేశంతో పాటు మరో 200 దేశాలు, టెరిటరీస్‌లలో ప్రైమ్ సభ్యులు ఉన్నారని.. వాళ్లంతా నవంబర్ 20న మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాను చూడొచ్చంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా ట్రైలర్ విడుదలైందిప్పుడు. దీన్ని విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రిలీజ్ చేసారు. గుంటూరు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్ (Middle Class Melodies trailer)
ఈ సందర్భంగా దర్శకుడు వినోద్ అనంతోజు మాట్లాడుతూ ‘‘మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేది ప్రతీ ఒక్కరి కథ – నేను, మనలో ప్రతీ ఒక్కరిది. చూసేందుకు పెద్దగా కనిపించే చిన్న చిన్న కలలతో తరమబడే వా రందరిది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పాత్రల చుట్టూరా తిరిగే కథ ఇది. వారి జీవన ప్రయాణాలు ఎలా సాగుతాయో వివరించేది. మనకు సంబంధించిన కథాంశంతో సున్నిత హాస్యాన్ని మేళవించిన ఈ సి నిమాలో నిజజీవిత ఘటనల హాస్యాన్ని ప్రేక్షకులు ఆనందిస్తారని నేను విశ్వసిస్తున్నా. మిడిల్ క్లాస్ మెలో డీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం నాకెంతో ఆనందదాయకం. ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల పెదవులపై నేను నవ్వులు పూయించగలుగుతాను’’ అని తెలిపాడు.
నటుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘మిడిల్ క్లాస్ మెలోడీస్ నేను చాలా మంది అది తమ పాత్ర గా భావించే సగటు మనిషి పాత్ర పోషించాను. అతడికి పెద్ద పెద్ద కలలు ఉంటాయి. అయితే వాటిని నెర వేర్చుకోవడం మాత్రం అంత సులభం కాదు. జీవితంలోనూ చాలా సందర్భాల్లో అదే జరుగుతుంది. రాఘవ పాత్ర నేను గతంలో పోషించిన పాత్రల కంటే విభిన్నమైంది. నిజంగా ఇది సవాళ్లతో కూడుకున్న పాత్ర. ఏక కాలంలో నవ్వులను, ప్రేమను పండించాల్సి ఉంటుంది. అయితే వర్ష, వినోద్ వంటి ప్రతిభావంతులతో కలసి పని చేయడంతో ఇది నాకెంతో సులభమైపోయింది. ఎంతో సౌకర్యంగానే పూర్తయిపోయింది’’ అని అన్నాడు.
విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ
హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ ‘‘మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేది నా మనస్సుకు ఎంతగానో నచ్చిన సినిమా. ఎందుకంటే ఈ జట్టులో మేమంతా కూడా దీని కోసం ఎంతో ప్రేమతో, ఇష్టంతో కలసి పని చేశాం. దీన్ని గనుక చూస్తే, అది ఇక మనస్సుకు హత్తుకుపోవడం ఖాయం. పరిస్థితులు, క్యారెక్టర్లు...ప్రతీ ఒక్కటి కూడా నిజమైందిగా ఉంటుంది, మనకు సంబంధించిందిగా ఉంటుంది. గుంటూరు మాండలికం కోసం నేను బాగా కష్టపడాల్సి వచ్చింది. ఎంతో శిక్షణ పొందాల్సి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన దర్శకుడు వినోద్ తో కలస పని చేయడం గొప్పగా అనిపించింది. డైలాగులు సరిగా పలకడంలో ఆయన నాకెంతో సాయం చేశారు’’ అని చెప్పింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.