Home /News /movies /

ANAND DEVARAKONDA ABHISHEK BENERJEE HIGHWAY MOVIE STREMING IN AHA OTT TA

Highway : ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీతో కలిసి నటించిన ఆహా వారి ఒరిజినల్ సినిమా ‘హైవే’

ఆహా ఓటీటీలో ’హైవే’ (Twitter/Photo)

ఆహా ఓటీటీలో ’హైవే’ (Twitter/Photo)

Highway OTT Streaming | ఎప్పుడూ అందరిని సరికొత్తగా అలరించే "ఆహా" ఈసారి మరోకొత్త కథ తో మన ముందుకు వచ్చేస్తోంది. ఆహా ''హైవే'' అనే సినిమాతో త్వరలో అందరి ముందుకి రాబోతుంది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    Highway OTT Streaming | ఎప్పుడూ అందరిని సరికొత్తగా అలరించే "ఆహా" ఈసారి మరోకొత్త కథ తో మన ముందుకు వచ్చేస్తోంది. ఆహా ''హైవే'' అనే సినిమాతో త్వరలో అందరి ముందుకి రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రధారులుగా, కే వి గగన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆహా స్క్రీన్స్ మీద రాబోతుంది.కథ విషయానికివస్తే ఫోటోగ్రాఫర్ విష్ణు (ఆనంద్ దేవరకొండ), తులసి (మానస) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమ కథలో, ఒక సీరియల్ కిల్లర్ 'డి' అనే పేరుతో ప్రవేశిస్తాడు. విష్ణు తన తులసిని కాపాడుకోగల్గుతాడా? ఎప్పుడూ చూడని విధంగా ఈ సైకొలాజికాల్ థ్రిల్లర్ సినిమా ఉండబోతుంది. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ పాత్రలు చాలా కొత్తగా ఉండబోతున్నాయి. ఈ సినిమా పోస్టర్ ను ఆహా ఆగష్టు 6న ఆవిష్కరించింది.

    ఆహా సినిమా అంటేనే ఆహా అని అందరు అంటారు. అందుకు నిదర్శనమే ''కలర్ ఫోటో''. 68 నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ రీజినల్ ఫిలిం గా అవార్డు గెలుచుకుని అందరి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఆహా ఇప్పుడు ''హైవే'' సినిమా తో మరోసారి అందరి మన్ననలను పొందడానికి సిద్ధమవుతుంది.



    విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చినా ఆనంద్ దేవరకొండ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు యువ హీరో ఆనంద్ దేవరకొండ. ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడిప్పుడు. ఈయన ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి గీతా ఆర్ట్స్‌ అనుబంధ సంస్థలో వస్తుంది. అదే 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై SKN, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చ్ 15న ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. వాడిన రోజా పువ్వును హీరో ఆనంద్ దేవరకొండ పట్టుకుని తీక్షణంగా చూస్తుంటాడు.. రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఆమె స్పందన కోసం ఎదురు చూస్తున్నాడు.. ఈ ఓల్డ్ రోజ్ ఫ్లవర్ వెనక దాగి ఉన్న కథేంటి అనేది సినిమాలో చూడాలి అంటున్నారు మేకర్స్.

    Ashwini Dutt - Chiranjeevi : చిరంజీవి,వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే..


    ఈ పోస్టర్‌తో ఆనంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీమ్ మెంబర్స్. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న 'బేబీ' సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. మరోవైపు ఈయన నటిస్తున్న మరో సినిమా `హైవే`. 118, WWW లాంటి సినిమాల తర్వాత ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది.కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆనంద్ దేవరకొండకు ‘హైవే’ మరొక కొత్త తరహా సినిమా కానుందని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌, అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్, సత్య, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Aha OTT Platform, Anand Devarakonda, Tollywood

    తదుపరి వార్తలు