హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan | Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి మరో సీన్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

Pawan Kalyan | Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి మరో సీన్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

‘భీమ్లా నాయక్’ (Twitter/Photo)

‘భీమ్లా నాయక్’ (Twitter/Photo)

Pawan Kalyan | Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ”భీమ్లా నాయక్” (Bheemla Nayak) అని తెలిసిందే.. ఈ సినిమా నుంచి మాస్ డైలాగ్ చెప్పే ఓ సీన్ లీక్ అయినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ”భీమ్లా నాయక్” (Bheemla Nayak). యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రం నుంచి ఓ క్లిప్ లీకైనట్లు తెలుస్తోంది. భీమ్లా నాయక్ నుంచి పవన్ చెప్పే ఓ మాస్ డైలాగ్ కి సంబంధించిన చిన్న క్లిప్ బయటకి వచ్చిందని సమాచారం. ఇక గతంలో కూడా చాలా సినిమాలకు చెందిన ముఖ్యమైన సీన్స్ లీక్స్ రూపంలో బయటకు వచ్చి చిత్రబృందానికి తలనొప్పిగా మారాయి. చూడాలి మరి ఈ లీక్స్ పరంగా టాలీవుడ్ లో ఆయా సినిమాల మేకర్స్ ఎంత వరకు యాక్షన్ తీసుకుంటున్నారో ఏమో. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టైనా చిత్రం అయ్యప్పనమ్ కోషీయమ్ తెలుగు రీమేక్‌గా వస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి (Rana Daggubati) పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్యా మీనన్, (Nithya menen) నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలకానుంది.

Kiara Advani : ఖతర్నాక్ లుక్‌లో కేక పెట్టించిన కియారా అద్వానీ..

ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓ పాటను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శనం మొగులయ్య పాడిన ఈ పాట ఎంతోగాను ఆకట్టుకుంది. అయితే ఈ పాటలో పోలీసుల గురించి రాసిన కొన్ని పదాలపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి రాసిన కొన్ని పదాలు పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్‌ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఆ సినిమాతో పాట పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ప్రకటించారు.

Nithiin Maestro Twitter Review : నితిన్ మాస్ట్రో ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ...

ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. పవన్ బర్త్ డే సందర్భంగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్.

First published:

Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Tollywood news

ఉత్తమ కథలు