అమెజాన్‌కు చుక్కలు చూపించిన ‘కేజీఎఫ్’

KGF Movie Vs Amzon Prime | కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది. విడుదలై రెండు నెలలు అవుతోన్న ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతునే ఉంది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల విషయమై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 4, 2019, 7:59 PM IST
అమెజాన్‌కు చుక్కలు చూపించిన ‘కేజీఎఫ్’
కేజియఫ్ మూవీ
  • Share this:
కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది. విడుదలై రెండు నెలలు అవుతోన్న ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతునే ఉంది. తాజాగా ‘కేజీఎఫ్’ సినిమా కర్ణాటకలో ‘బాహుబలి’ సెట్ చేసిన రికార్డును క్రాస్ చేసింది. ఒక్క కన్నడలోనే రూ.100 కోట్లను వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

తెలుగులో రూ.20 కోట్ల షేర్  రాబట్టిన ఈ సినిమా హిందీ వెర్షన్ రూ. 50 కోట్లకు పైగానే కొల్లగొట్టింది. మొత్తంగా  ఈసినిమా వాల్డ్ వైడ్‌గా రూ.240 కోట్ల కలెక్షన్స్ రాబట్టి   ఔరా అనిపించింది.

అంతేకాదు ‘కేజీఎఫ్’ సినిమాను  అమెజాన్ ప్రైమ్ వాళ్లు రూ.18 కోట్లకు ఈ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకున్నారు. కన్నడ భాష వరకు ఇది ఒక రికార్డు అని చెప్పాలి.

కాగా..‘కేజీఎఫ్’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసే విషయంలో ఈ సంస్థ చేసిన ట్వీట్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. 5 వేల రీ ట్వీట్ చేస్తే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తామంటూ ట్విట్టర్ ద్వారా ప్రకటిచింది.  గంటలోనూ 5వేల రీట్వీట్స్ వచ్చాయి.

ఆ తర్వాత మేము ట్విట్టర్‌లో తప్పుడు అనౌన్స్‌మెంట్ చేసాము. మిస్టేక్ జరిగింది అంటూ ప్రైమ్ సంస్త మాట మార్చడంతో ఫ్యాన్స్ బ్యాన్ అమెజాన్ ప్రైమ్ అనే యాష్ ట్యాగ్‌తో విరుచుకుపడ్డారు. దీంతో అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన మాట ప్రకారం ఫిబ్రవరి 5న ఈ సినిమాను కన్నడ, తెలుగు, హిందీలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. త్వరలో ‘కేజీఎఫ్’ సినిమాకు సంబంధించిన రెండో పార్ట్ త్వరలో విడుదల కానుంది.

సమంత హాట్ ఫోటోస్
ఇవి కూడా చదవండి 

తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ పట్టేసిన ప్రియా వారియర్...

మెగా వారసుడు రామ్ చరణ్ మరో ఇంటివాడు కాబోతున్నాడు..

రాజశేఖర్ ‘కల్కి’ అవతారం..మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా యాంగ్రీమెన్‌

 
First published: February 4, 2019, 7:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading