రాజమౌళి చేతులు మీదుగా విడుదలైన ‘అమృతం’ ద్వితీయం ట్రైలర్..

గుణ్ణం గంగరాజు నిర్మాతగా జస్ట్ ఎల్లో బ్యానర్‌పై 'అమృతం' టీవి సీరియల్ తెలుగు వారికి సుపరిచితమే. అప్పట్లో అమృతం సీరియల్ ఓ సంచలనం. త్వరలో జీ 5లో అమృతం సీరియల్ సెకండ్ పార్ట్ ప్రసారం కానుంది. తాజాగా ఆ సీరియల్‌కు సంబంధించిన ట్రైలర్‌ను రాజమౌళి విడుదల చేసారు.

news18-telugu
Updated: March 13, 2020, 11:01 AM IST
రాజమౌళి చేతులు మీదుగా విడుదలైన ‘అమృతం’ ద్వితీయం ట్రైలర్..
రాజమౌళి చేతులు మీదుగా అమృతం ద్వితీయం ట్రైలర్ విడుదల (Twitter/Photo)
  • Share this:
Amrutham : గుణ్ణం గంగరాజు నిర్మాతగా జస్ట్ ఎల్లో బ్యానర్‌పై 'అమృతం' టీవి సీరియల్ తెలుగు వారికి సుపరిచితమే. అప్పట్లో అమృతం సీరియల్ ఓ సంచలనం.ఇప్పటికే ఎన్నో ఛానెల్స్‌ ఈ సీరియల్ ప్రసార హక్కులు కొని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. ప్రసారం చేసినపుడల్ల ఈ సీరియల్‌కు భారీ టీఆర్పీ రేటింగ్స్ వస్తూనే ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే తెలుగు టెలివిజన్ సీరియల్ చరిత్రలో ‘అమృతం’ ఓ క్లాసిక్‌లా నిలిచిపోయింది. 19 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సీరియల్ ఎంతో మంది ప్రేక్షకులను అలరిచింది. ఓ హోటల్ చుట్టూ తిరిగే కథలతో అల్లుకున్న ఎపిసోడ్స్ తో వారం వారం తెలుగువారిని గిలిగింతలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ ప్రస్తుతం 30 నుండి 40 ఏళ్ల వయసు ఉన్న చాలామందికి అభిమాన సీరియల్. ఎప్పుడెప్పుడు అమృతం కొత్త ఎపిసోడ్ వస్తుందా అంటూ ఎదురు చూసేవారు అప్పట్లో.అమృతం సీరియల్‌ను ఆ మధ్య ఈటీవీ ప్లస్‌లో పున: ప్రసారం చేశారు. అయితే అమృతంకు వస్తున్న ఆదరణ చూసి జీ తెలుగు వారు అమృతం వెబ్ సిరీస్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. అమృతం 2 అనే టైటిల్ తోనే ఇది ప్రసారం కాబోతుంది. దీనికి ‘మూర్ఖత్వానికి మరణం లేదు’ అనేది ట్యాగ్ లైన్.

Amrutham,amrutham comedy,amrutham serial,amrutham2,amrutham comedy serial,amrutham comedy,comedy,amrutham comedy show,chandamama lo amrutham,amrutham tv show,jabardasth comedy show,amrutham telugu comedy serial,amrutham serial comedy scenes,amrutham serial song,alasyam amrutham comedy scenes,vasu inturi comedy,amrutham telugu serial,amrutham telugu comedy web series,amrutham serial best comedy scenes,అమృతం సీరియల్,అమృతం
అమృతం2 టీమ్ Photo : Twitter


అమృతం పాత్రలో శివాజీ రాజా కొన్నాళ్లు.. నరేష్ కొన్నాళ్లు.. ఆ తర్వాత హర్షవర్ధన్ చేశారు. అయితే ఎక్కువగా హర్షవర్దన్ అమృతం పాత్రలో నటించడంతో అమృతం అనగానే ఆయనే గుర్తుకు వస్తుంటారు. అందుకే తాజాగా వస్తోన్న అమృతం 2 కు కూడా అమృతరావు పాత్రలో హర్షవర్ధన్‌ను తీసుకున్నారు. తాజాగా ఈ సీరియల్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్‌లో విడుదల చేసారు. అంతేకాదు ‘అమృతం ద్వితీయం అద్భుతీయం అంటూ అమృతం సీరియల్ గొప్పతనాన్ని తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. కన్నీళ్లు తెప్పించే సీరియల్స్ ఉన్న కాలంలో కామెడీతో ఈ షో ఒక చరిత్ర సృష్టించిందన్నారు. అంతేకాదు ఐదు సార్లు ప్రసారమైన ఏకైక సీరియర్. 270 మిలియన్ వ్యూస్.. గడిచిన కొద్ది నెలలుగా 6 మిలియన్ వ్యూస్ సాధించిన సీరియల్ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక అమృతం స్నేహితుడు ఆంజనేయులు పాత్రలో మొదటి నుండి చివరి వరకు గుండు హనుమంతరావే చేశారు. అయితే ఆయన మరణంతో ఇప్పుడా పాత్రను ఎల్బీ శ్రీరామ్ చేస్తున్నారు. మిగిలిన అప్పాజీ.. సర్వం పాత్రలను అప్పటి వారే చేస్తున్నారు. అమృతం 2కు కూడా రచయితగా గుణ్ణం గంగరాజు వ్యవహరిస్తుండగా సందీప్ దర్శకత్వం వహిస్తున్నాడు,ఈ తాజా అమృతం 2 ఉగాది కానుకగా మార్చి 25 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.  మరి మునుపటిలా ఈ సీరియల్ ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 13, 2020, 10:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading