కొత్తగా వస్తోన్న అలనాటి అమృతం సీరియల్..

గుణ్ణం గంగరాజు నిర్మాతగా జస్ట్ ఎల్లో బ్యానర్‌పై అమృతం టీవి సీరియల్ తెలుగు వారికి సుపరిచితమే.

news18-telugu
Updated: January 9, 2020, 12:55 PM IST
కొత్తగా వస్తోన్న అలనాటి అమృతం సీరియల్..
Twitter
  • Share this:
గుణ్ణం గంగరాజు నిర్మాతగా జస్ట్ ఎల్లో బ్యానర్‌పై అమృతం టీవి సీరియల్ తెలుగు వారికి సుపరిచితమే. అప్పట్లో అమృతం సీరియల్ ఒక సంచలనం. ఓ హోటల్ చుట్టూ తిరిగే కథలతో అల్లుకున్న ఎపిసోడ్స్ తో వారం వారం తెలుగువారిని గిలిగింతలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ ప్రస్తుతం 30 నుండి 40 ఏళ్ల వయసు ఉన్న ప్రేక్షకులు చాలామందికి అభిమాన సీరియల్. ఎప్పుడెప్పుడు అమృతం కొత్త ఎపిసోడ్ వస్తుందా అంటూ చాలామంది ఎదురు చూసేవారు అప్పట్లో.  అమృతం సీరియల్‌ను ఆ మద్య ఈటీవీ ప్లస్‌లో పున: ప్రసారం చేశారు. ఆ తర్వాత యూట్యూబ్‌లో ఉంచారు. తాజాగా అక్కడి నుండి కూడా తీసేసారు. ప్రస్తుతం ఆ సిరీయల్ జీ5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్పై ఉంచారు. అయితే అమృతంకు వస్తున్న ఆదరణ చూసి జీ తెలుగు వారు అమృతం వెబ్ సిరీస్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదిలావుంటే ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ప్రసారం చేసినా.. 'అమృతం' సీరియల్‌కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లలేదు. ఈ సీరియల్‌ను ప్రేక్షకులు ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ వీక్షిస్తూనే వున్నారు. దీంతో ఈ సీరియల్‌కి వున్న అదరణచూసి జీ తెలుగు ఈ సీరియల్ దర్శకుడు నిర్మాత గుణ్ణం గంగరాజును ఈ వెబ్ సిరీస్ కోసం రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం. ఇది గనక వర్కౌట్ అయితే జీ తెలుగు ఈ సీరియల్‌ని ఛానెల్‌లో కూడా ప్రసారం చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అప్పటి కామెడీని ఇప్పటి ప్రేక్షకులు ఆదరిస్తారా ? ఈ వెబ్ సిరీస్‌లో నటించే టీం గతంలో అమృతంలా ప్రేక్షకులను ఆకట్టుకోగలరా? అనేవి ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ముందున్న ప్రశ్నలు. చూడాలి మరీ ఎలా ఉండనుందో..
కంగనా హాట్ పిక్స్..


First published: January 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు