త్వరలో రాబోతున్న అమృతం 2.0... అప్పటిలా అలరించగలదా..

అమృతం ద్వితీయం (amrutham dhvitheeyam)

Amrutham  : హాస్యం అంటే అందరికీ ఇష్టమే. బుల్లితెరపై కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన 'అమృతం' సీరియల్ మళ్లీ ప్రేక్షకుల ముందుకి రానుంది.

  • Share this:
    Amrutham  : గుణ్ణం గంగరాజు నిర్మాతగా జస్ట్ ఎల్లో బ్యానర్‌పై 'అమృతం' టీవి సీరియల్ తెలుగు వారికి సుపరిచితమే. అప్పట్లో అమృతం సీరియల్ ఓ సంచలనం. ఓ హోటల్ చుట్టూ తిరిగే కథలతో అల్లుకున్న ఎపిసోడ్స్ తో వారం వారం తెలుగువారిని గిలిగింతలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ ప్రస్తుతం 30 నుండి 40 ఏళ్ల వయసు ఉన్న చాలామందికి అభిమాన సీరియల్. ఎప్పుడెప్పుడు అమృతం కొత్త ఎపిసోడ్ వస్తుందా అంటూ ఎదురు చూసేవారు అప్పట్లో.  అమృతం సీరియల్‌ను ఆ మధ్య ఈటీవీ ప్లస్‌లో పున: ప్రసారం చేశారు. ఆ తర్వాత యూట్యూబ్‌లో కొన్నాళ్లు ఉంచారు. తాజాగా అక్కడి నుండి కూడా తీసేసారు. ప్రస్తుతం ఆ సిరీయల్ జీ5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్పై ఉంచారు. అయితే అమృతంకు వస్తున్న ఆదరణ చూసి జీ తెలుగు వారు అమృతం వెబ్ సిరీస్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. అమృతం 2 అనే టైటిల్ తోనే ఇది ప్రసారం కాబోతుంది. అమృతం పాత్రలో శివాజీ రాజా కొన్నాళ్లు.. నరేష్ కొన్నాళ్లు.. ఆ తర్వాత హర్షవర్ధన్ చేశారు. అయితే ఎక్కువగా హర్షవర్దన్ అమృతం పాత్రలో నటించడంతో అమృతం అనగానే ఆయనే గుర్తుకు వస్తుంటారు. అందుకే తాజాగా వస్తోన్న అమృతం 2 కు కూడా అమృతరావు పాత్రలో హర్షవర్ధన్‌ను తీసుకున్నారు.


    ఇక అమృతం స్నేహితుడు ఆంజనేయులు పాత్రలో మొదటి నుండి చివరి వరకు గుండు హనుమంతరావే చేశాడు. అయితే ఆయన మరణంతో ఇప్పుడా పాత్రను ఎల్బీ శ్రీరామ్ చేస్తున్నాడు. మిగిలిన అప్పాజీ.. సర్వం పాత్రలను అప్పటి వారే చేస్తున్నారు. ఈ తాజా అమృతం 2 అతి త్వరలో జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. అమృతం 2కు కూడా రచయితగా గుణ్ణం గంగరాజు వ్యవహరిస్తుండగా సందీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ వెబ్ సిరీస్‌ గతంలో అమృతంలా ప్రేక్షకులను ఆకట్టుకోగలదా? చూడాలి మరీ ఎలా ఉండనుందో..
    Published by:Suresh Rachamalla
    First published: