Navaneet Kaur: MP నవనీత్ కౌర్ ఇంట్లో కరోనా కలకలం..

MP Navaneet Kaur: నవనీత్ కౌర్.. అప్పట్లో ఈమె పేరు తెలుగులో బాగానే వినిపించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలు మానేసి రాజకీయాలపై ఫోకస్ చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 2, 2020, 5:35 PM IST
Navaneet Kaur: MP నవనీత్ కౌర్ ఇంట్లో కరోనా కలకలం..
నవనీత్ కౌర్ (navaneet kaur)
  • Share this:
నవనీత్ కౌర్.. అప్పట్లో ఈమె పేరు తెలుగులో బాగానే వినిపించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలు మానేసి రాజకీయాలపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఈమె అమరావతి ఎంపి కూడా. ఆమె భర్త రవి రానా బద్నేరా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. పూర్తిగా రాజకీయాలతో బిజీ అయిపోయింది నవనీత్ కౌర్. అప్పట్లో తెలుగు సినిమాలు కూడా బాగానే చేసింది నవనీత్. తర్వాత మహారాష్ట్ర వెళ్లి అక్కడే పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ అయిపోయింది నవనీత్.
నవనీత్ కౌర్ (navaneet kaur)
నవనీత్ కౌర్ (navaneet kaur)


ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచాన్ని కంగారు పెడుతున్న కరోనా నవనీత్ ఇంటిని కూడా వదలడం లేదు. తాజాగా నవనీత్ భర్త రవి రానా తండ్రి, ఆమె మామ గంగాధర్ రానాకు కరోనా పాజిటివ్ వచ్చింది. రానా కుటుంబంలో దాదాపు 50 నుంచి 60 మంది సభ్యులు, కార్యకర్తలు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అలాగే ఎమ్మెల్యే రవి రానా ఇంటి ప్రాంగణాన్ని మొత్తం శుభ్రపరచనున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
నవనీత్ కౌర్ (navaneet kaur)
నవనీత్ కౌర్ (navaneet kaur)

ఈ క్రమంలోనే నవనీత్, ఆమె భర్త శాంపిల్స్ కూడా తప్పుగా తీసుకున్నారు వైద్యులు. దీనిపై రవి రానా ఏకంగా ఆరోగ్య శాఖకు ఫిర్యాదు కూడా చేసాడు. ఇప్పుడు నవనీత్ మామ గారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు రిపోర్ట్స్ తెలిపాయి. ఈయనకు ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: August 2, 2020, 5:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading