కరోనా మహమ్మారికి అందరూ సమానమే.. చిన్నోడు లేదు పెద్దోడు లేదు.. సామాన్యుడి దగ్గర నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎందరో రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల ప్రముఖ సింగర్ బాల సుబ్రహ్మణ్యం దీని బారిన పడగా.. తాజాగా సినీనటి, మహారాష్ట్రలోని అమరావతి నియోజక వర్గం ఎంపీ నవనీత్ కౌర్ కరోనా బారిన పడింది. ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొదటగా వీరి ఇంట్లో నటి నవనీత్ కౌర్ మామ గంగాధర్ రానాకు కరోనా సోకింది. ఆ తర్వాత కరోనా వైరస్ ఇంట్లో ఉన్న ఇతరులు కూడా సోకింది. దీంతో ఆ కుటుంబంలో దాదాపు 50 నుంచి 60 మంది సభ్యులు, కార్యకర్తలు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ ఇంటి ప్రాంగణాన్ని మొత్తం శుభ్రపరచనున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
ఇక నవనీత్ కౌర్.. తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. శీను వాసంతి లక్ష్మి, రణం, గుడ్ బాయ్, రూమ్ మేట్స్ వంటి సినిమాల్లో నటించింది. అయినా సరైన అవకాశాలు లేక.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలు మానేసి రాజకీయాలపై ఫోకస్ చేసింది. ఈమె ప్రస్తుతం అమరావతి ఎంపి కాగా... ఆమె భర్త రవి రానా బద్నేరా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైయాడు. దీంతో ఆమె ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలతో బిజీ అయిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.