Navaneet Kaur: నవనీత్ కౌర్ ఆరోగ్యం మరింత విషమం..

Navaneet Kaur: ఎంపీ, నటి నవనీత్ కౌర్ కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతుంది. ఈమె కెరీర్ మొదట్లో కొన్ని తెలుగు సినిమాలు చేసింది. ఇక్కడ బాగానే గుర్తింపు తెచ్చుకుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 15, 2020, 6:14 PM IST
Navaneet Kaur: నవనీత్ కౌర్ ఆరోగ్యం మరింత విషమం..
ఎంపీ నవనీత్ కౌర్ (Navaneet Kaur)
  • Share this:
ఎంపీ, నటి నవనీత్ కౌర్ కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతుంది. ఈమె కెరీర్ మొదట్లో కొన్ని తెలుగు సినిమాలు చేసింది. ఇక్కడ బాగానే గుర్తింపు తెచ్చుకుంది. చిన్న సినిమాల్లో నవనీత్ ఎక్కువగా నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ హవా చూపిస్తుంది నవనీత్. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం క్షీణించింది. ఆర్పీ పట్నాయక్ హీరోగా వచ్చిన 'శీను వాసంతి లక్ష్మీ'తో పాటు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగలో యంగ్ యమా పాటలో నర్తించింది నవనీత్ కౌర్.
నవనీత్ కౌర్ (navaneet kaur)
నవనీత్ కౌర్ (navaneet kaur)


కొన్ని రోజుల కింద ఈమె మామ గంగాధర్ రానాకు కరోనా సోకింది. ఆ తర్వాత ఆయన నుంచి కుటుంబం అంతా కరోనా బారిన పడింది. ఆమె భర్త.. పిల్లలకు కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ల పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉంది. ఆరోగ్యం కూడా కుదుటపడింది. కానీ ఓ బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం నవనీత్ కౌర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో ఆమెను ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆమె పిల్లలు పాజిటివ్‌గా రావడంతో వాళ్ల నుంచి ఈమెకు కూడా సోకింది.
నవనీత్ కౌర్ (navaneet kaur)
నవనీత్ కౌర్ (navaneet kaur)

నవనీత్ కుటుంబం అంతా ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. నవనీత్ కౌర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ముందు నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ కూడా మార్పు రాకపోవడంతో ముంబైలోని ప్రఖ్యాత లీలావతి ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు. ఈమె ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: August 15, 2020, 6:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading