అమ్మరాజ్యంలో కడపబిడ్డలు పబ్లిక్ టాక్..

రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలపై వివాదస్పద సినిమా 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' అనేక అవాంతరాలను ఎదుర్కోని ఈరోజు విడుదలైంది.

news18-telugu
Updated: December 12, 2019, 4:04 PM IST
అమ్మరాజ్యంలో కడపబిడ్డలు పబ్లిక్ టాక్..
Twitter
  • Share this:
రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలపై వివాదస్పద సినిమా 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' అనేక అవాంతరాలను ఎదుర్కోని ఈరోజు విడుదలైంది. మొదట 'కమ్మరాజ్యంలో కడపబిడ్డలు' అనే పేరుతో సినిమా తీసి, సెన్సార్ అభ్యంతరాలతో రాజీపడి, 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా టైటిల్‌ను మార్చారు రాంగోపాల్ వర్మ. అయితే ఈ సినిమాను వర్మ కాకుండా ఆయన శిష్యుడు సిద్ధార్థ తాతోలు డైరెక్ట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ముఖ్యంగా ఏపీలో ఎన్నికల ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఆధారంగా తెరకెక్కింది. అంతేకాదు ఈ సినిమాలో ఏపీలో రానున్న రోజుల్లో ఏం జరగనున్నదో ఊహిస్తూ సినిమాను అల్లారు. కథ విషయానికి వస్తే.. ఇటీవల ఎన్నికల్లో అధికార పార్టీ వెలుగుదేశం పార్టీ (వీడీపీ) ఓడిపోతుంది. దీంతో అప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్న ఆర్‌సీపీ 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తుంది.  వీడీపీ కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకుంటుంది. దీంతో వీడీపీ పార్టీ అధినేత బాబు, ఆయన కుమారుడు ఆకాశ్( చినబాబు) కొత్త ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎలాంటి ఎత్తులు వేశారు.. ఆ ఎత్తులను ఆర్సీపీ అధినేత వీఎస్ జగన్నాథరెడ్డి ఎలా ఎదుర్కోన్నాడు అనేది కథ. అయితే ఈ సినిమాను చూసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్నీ పంచుకుంటున్నారు. వారేమంటున్నారో చూద్దాం..First published: December 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>