news18-telugu
Updated: November 15, 2019, 7:15 AM IST
Alia Bhatt : బాలీవుడ్లో లెక్కలేనంత మంది నటీనటులున్నా... వారిలో అలియాభట్ ప్రత్యేకమైనది. ఈ భామ ఓవైపు సినిమాల్లో దూసుకెళ్తూనే... మరోవైపు ఇతర బిజినెస్లపైనా ఫోకస్ పెడుతోంది. తాజాగా తనే స్వయంగా ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది.
Alia Bhatt : బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‌తో చేతులు కలిపింది అమెరికాకు చెందిన AMJ క్యాపిటల్ వెంచర్స్. ఈ సంస్థ... అలియాభట్ ప్రారంభించిన ఫ్యాషన్ టెక్నాలజీ స్టార్టప్ "స్టైల్ క్రాకర్"లో రూ.14 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఈ స్టార్టప్... విదేశీ నిధులను ఉపయోగించుకొని... మెషిన్ లెర్నింగ్, టెక్నాలజీని ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి తేనుంది. ఇండియా మొత్తానికి స్టైల్ క్రాకర్‌ను విస్తరించేందుకు విదేశీ నిధులు ఉపయోగపడతాయని భావిస్తోంది. AMJ క్యాపిటల్ సంస్థ ఇప్పటికే అమెరికాలా చాలా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడా సంస్థ ఇండియావైపు చూస్తోంది. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఎవైల్ ఫైనాన్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టింది. ఎవైల్ ఫైనాన్స్ సంస్థ ఉన్నత విద్యా కోర్సులకు ఫైనాన్స్ ఇస్తోంది.
స్టైల్ క్రాకర్ సంస్థ ఫ్యాషన్ రంగంలో తన ప్రత్యేకతను చూపించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతీ వినియోగదారుడినీ వ్యక్తిగతంగా గుర్తించి... వారికి సెట్ అయ్యే స్టైల్, ఫ్యాషన్ డిజైనర్ డ్రెస్సులు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు విదేశీ నిధుల రాకతో... మరింత దూసుకెళ్లేందుకు వీలవుతుందని భావిస్తోంది.
Pics : సోలో ట్రావెలర్... ప్రపంచాన్ని చుట్టేస్తున్న యువతి
ఇవి కూడా చదవండి :
GST | జీఎస్టీ ఫైలింగ్ గడువు పెంపు... నో టెన్షన్...
నేడు టీఆర్ఎస్, వైసీపీ సమావేశాలు... ఏం చర్చిస్తారంటే...
కొంపముంచిన లింక్... రూ.4 లక్షలు హాంఫట్
Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...
క్లౌడ్ బెర్రీస్ విశేషాలు తెలుసా... టేస్ట్ ఎలా ఉంటాయి?
Published by:
Krishna Kumar N
First published:
November 15, 2019, 7:15 AM IST