అమితాబ్, ఆమిర్‌ల ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మోషన్ పోస్టర్ రిలీజ్

లేటెస్ట్‌గా ఈ మూవీ మేకర్స్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీ టైటిల్‌తో కూడిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

news18-telugu
Updated: September 17, 2018, 3:34 PM IST
అమితాబ్, ఆమిర్‌ల ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మోషన్ పోస్టర్ రిలీజ్
అమితాబ్, అమీర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’ మూవీస్ తర్వాత అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’. బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్ ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.బిగ్ బీ, అమీర్‌లు ఫస్ట్ టైమ్ ఈ మూవీ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ మూవీని ‘ధూమ్ 3’ ఫేమ్ విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్నాడు.

‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ రాజస్థాన్ సంచార తెగలకు సంబంధించిన బందిపోటు దొంగల స్టోరీ. ఈ సినిమాను ఎక్కువగా సముద్రం, పడవల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ మూవీ కోసం ఏకంగా రెండు లక్షల కిలోల బరువున్న భారీ పడవలను రూపొందించారు. దాదాపు వెయ్యి మంది ఒక యేడాది కష్టపడి ఈ పడవ సెట్‌ను రూపొందించారు. యూరప్‌లోని మాల్టా సముద్రతీరంలో ఈ పడవలను రూపొందించారు.లేటెస్ట్‌గా ఈ మూవీ మేకర్స్ ఈ మూవీ టైటిల్‌తో కూడిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఇప్పటి వరకు  బాలీవుడ్‌లో కనీవినీ ఎరగని రీతిలో ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీని తెరకెక్కిస్తున్నారు.  అంతేకాదు ఈ మూవీలో విజువల్ ఎపెక్ట్స్‌కు ప్రత్యేక స్థానం వుంది. కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీని నవంబర్ 8న దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు ఈ మూవీ మోషన్ పోస్టర్‌లో చూపించారు. ఈ మూవీని ఒకేసారి భారత్‌తో పాటు చైనాలో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.  మరి ఈ మూవీ బాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తదో చూడాలి.
First published: September 17, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు