ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ నివారణ కోసం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేయడంలో నిమగ్నమయ్యాయి. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు ఇప్పటికే దేశ ప్రజలు చప్పట్లతో పాటు... దీపాలు వెలిగించి కరోనా పై పోరులో దేశ ప్రజలంతా ఒక్కటే అని నిరూపించారు. మరోవైపు కరోనా పై పోరులో సినీ నటులు కూడా దేశానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు.ఇప్పటికే లా మంది తెలుగు సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ డ్కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. అటు తమిళ సినీ నటులు తమ సినీ కార్మికులను ఆదుకోవడం కోసం తమ వంతు సాయం చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ నటులు ఒక్కొక్కరుగా తమ వంతు విరాళాలు ప్రకటిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్.. లాక్డౌన్ కారణంగా పని లేకుండా పోయిన లక్ష మంది ప్రజలకు ఒక నెలకు సంబంధించిన నిత్యావసరాలు అందించేందుకు ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫిడరేషన్‌తో కలిసి ముందుకు వచ్చారు. అమితాబ్ బచ్చన్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి సోనీ పిక్చర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి.
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో అమితాబ్ బచ్చన్ చేతనైైన సాయం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా పనులు లేకుండా పోయిన వారికి నెలవారి నిత్యావసరాలు అందించనున్నట్టు సోనీ పిక్చర్స్ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు అమితాబ్ బచ్చన్ సోనీ టీవీలో ప్రసారమయ్యే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోకి అమితాబ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Bollywood, Coronavirus, Covid-19