అమితాబ్ నిజంగా ఆ సాహసం చేస్తున్నాడా..ఫ్యాన్స్‌కు బిగ్‌ బీ బిగ్ షాక్

గత కొన్నేళ్లుగా స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ వస్తోన్న అక్షయ్ కుమార్..మరోసారి సౌత్‌లో హిట్టైన ‘కాంచన’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ రీమేక్‌తో దర్శకుడిగా రాఘవ లారెన్స్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ మరో చాలెంజింగ్ పాత్ర చేయబోతున్నట్టు సమాచారం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 28, 2019, 4:50 PM IST
అమితాబ్ నిజంగా ఆ సాహసం చేస్తున్నాడా..ఫ్యాన్స్‌కు బిగ్‌ బీ బిగ్ షాక్
అమితాబ్ బచ్చన్ (File)
  • Share this:
గత కొన్నేళ్లుగా స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ వస్తోన్న అక్షయ్ కుమార్..మరోసారి సౌత్‌లో హిట్టైన ‘కాంచన’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ రీమేక్‌తో దర్శకుడిగా రాఘవ లారెన్స్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించిన శరత్ కుమార్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తాజాగా ఈ హిందీ రీమేక్‌లో ట్రాన్స్‌జెండర్ పాత్ర చేయడానికి అమితాబ్ బచ్చన్ ఓకే చెప్పినట్టు సమాచారం.

ముందుగా ఈ పాత్ర కోసం అజయ్ దేవ్‌గణ్‌ను అనుకున్నా...ఫైనల్‌గా ఈ పాత్ర బిగ్‌బీని వరించింది. గతంలో అమితాబ్ బచ్చన్..‘లావారిస్’ సినిమాలో ‘మేరే అంగనేమే’ పాటలో పేడి పాత్రను పోషించి మెప్పించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు చాలా ఏళ్ల తర్వాత మరోసారి ట్రాన్స్‌జెండర్ పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇయర్ ఎండింగ్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
First published: January 28, 2019, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading