హోమ్ /వార్తలు /సినిమా /

అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్.. నానావతి హాస్పిటల్‌లో అడ్మిట్..

అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్.. నానావతి హాస్పిటల్‌లో అడ్మిట్..

అమితాబ్ బచ్చన్ (File/Photo)

అమితాబ్ బచ్చన్ (File/Photo)

Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి హాస్పిటల్ మెట్లెక్కాడు. ఈయన ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడని తెలుస్తుంది.

బాలీవుడ్‌లో మరో కరోనా పాజిటివ్ కేసు వచ్చింది. ఈ సారి ఏకంగా అమితాబ్ బచ్చన్ దీని బారిన పడ్డాడు. ఈయన ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు.తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే ట్వీట్ చేసాడు. తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పాడు అమితాబ్. ఈయన మాత్రం ముంబై నానావతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అప్పట్లో ఈయన కొన్నిసార్లు అనారోగ్యం పాలయ్యారు. కొన్ని రోజులు హాస్పిటల్‌లోనే ఉండి చికిత్స కూడా తీసుకున్నాడు.

అనారోగ్యం నుంచి కుదుటపడిన తర్వాత వరస సినిమాలు కూడా చేసాడు బాలీవుడ్ మెగాస్టార్. మళ్లీ ఇన్నాళ్లకు ఎందుకో తెలియదు కానీ ముంబై నానావతి హాస్పిటల్‌లో జులై 11 రాత్రి అడ్మిట్ అయ్యాడు. ఈయనకు కరోనా సోకిందనే విషయం తెలియగానే అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. తనను గత పది రోజులుగా కలిసిన వాళ్లు కూడా వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచించాడు అమితాబ్ బచ్చన్.

అమితాబ్ బచ్చన్ (File Photo)
అమితాబ్ బచ్చన్ (File Photo)

ఇప్పటికే ముంబైలో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. అక్కడ బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే టాలీవుడ్‌లో నిర్మాత పోకూరీ రామారావు కరోనాతో చనిపోయాడు. ఇక బాలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ కరోనాతోనే చనిపోయాడు. ఆయనతో పాటు మరో అరడజన్ మంది కూడా కోవిడ్ 19 కారణంగా కన్నుమూసారు. అందులో సీనియర్ నటులతో పాటు నిర్మాతలు కూడా ఉన్నారు. ఇప్పుడు అమితాబ్ కూడా కోవిడ్ బారిన పడటంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు.

First published:

Tags: Amitabh bachchan, Bollywood, Hindi Cinema

ఉత్తమ కథలు