AMITABH BACHCHAN SPOTTER IN HYDERABAD METRO RAILWAY STATION SB
Amitabh Bachchan: హైదరాబాద్ మెట్రో స్టేషన్లో అమితాబ్..
మెట్రో స్టేషన్’లో అమితాబ్
ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో అమితాబ్ కీలక పాత్ర చేస్తున్నసంగతి తెలిసిందే. గతకొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్లో అమితాబ్ పాల్గొంటున్నారు.
బాలీవుడ్ లెజెండరీ అమితాబ్ బచ్చన్ అకస్మాత్తుగా సాధారణ ప్రయాణికుడి మాదిరే మెట్రో స్టేషన్లో కనిపించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం అమితాబ్ బచ్చన్ దర్శనమిచ్చారు. అయితే ఆయన పక్కనే సినిమా షూటింగ్ చేసే చిత్రీకరణ బృందం కూడా ఉంది. ఇది చూసిన మెట్రో ప్రయాణికులు తమ ఫోన్లలో వీడియోలను షూట్ చేశారు.
అమితాబ్ బచ్చన్ 'ప్రాజెక్టు కె' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంత కాలంగా హైదరాబాద్ పరిసరాల్లోనే జరుగుతోంది. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొణె నటిస్తున్నారు. ఓ మెట్రో యూజర్ అమితాబ్ షూటింగ్ గురించి పోస్ట్ పెట్టాడు.
‘‘నాకు తెలిసి అమితాబ్ షూటింగ్ కోసం వచ్చి ఉండొచ్చు. ఓ బ్లూ లైన్ ట్రెయిన్ లోకి ఎవరినీ అనుమతించలేదు. నేను అమీర్ పేట స్టేషన్లో సాయంత్రం 6 గంటలకు వేచి ఉన్నాను. మెట్రో ఒక డమ్మీ రైలును రద్దీ వేళల్లో ఎందుకు నడిపిస్తోందో నాకు అప్పుడు అర్థం కాలేదు. రైలులో అమితాబ్ కనిపించలేదు కానీ, మెడలో ఐడీ కార్డులు వేసుకున్న కెమెరామ్యాన్ లు కనిపించారు’’ అని పేర్కొన్నాడు.
అమితాబ్ గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో ఆయన కీలక పాత్ర చేస్తున్నసంగతి తెలిసిందే. గతకొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్లో అమితాబ్ పాల్గొంటున్నారు. ఇటీవలే బిగ్ బీ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలతో ఫోటోలు దిగి హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆయన ‘వైజయంతి మూవీస్’ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవం ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో బిగ్ బీ కూడా సందడి చేశారు.
కార్యాలయ ప్రారంభోత్సవంలో రాఘవేంద్రరావు, అమితాబ్ బచ్చన్, ప్రశాంత్‌నీల్, ప్రభాస్, నాని, దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో కొన్నిరోజుల క్రితం నెట్టింట చక్కర్లు కొట్టగా.. తాజాగా ఓ వీడియోని వైజయంతి మూవీస్ షేర్ చేసింది. అమితాబ్, ప్రభాస్.. రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.