HOME »NEWS »MOVIE »amitabh bachchan sold his rolls royce phantom ba

ఖరీదైన కారును అమ్మేసిన అమితాబ్ బచ్చన్...

ఖరీదైన కారును అమ్మేసిన అమితాబ్ బచ్చన్...
అమితాబ్ బచ్చన్

ఏకలవ్య సినిమా‌లో అమితాబ్ బచ్చన్ నటనకు ఫిదా అయిన నిర్మాత విధు వినోద్ చోప్పా.. ఈ కాస్ట్‌లీ కారును బిగ్ బీకి గిఫ్ట్‌గా ఇచ్చారు.

  • Share this:
    బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన గ్యారేజ్‌లోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకదాన్ని అమ్మేశారు. రోల్స్ రాయిల్ పాంథమ్ కారును విక్రయించారు. మైసూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు తన కాస్ట్‌లీ కారును అమ్మేశారు. రోల్స్ రాయిస్ కారు ఇప్పటికే కొత్త ఓనర్ ఇంటికి కూడా చేరిపోయింది. ఇన్నాళ్లూ అమితాబ్ బచ్చన్ వద్ద ఉన్న ఈ రోల్స్ రాయిల్ కారు ఇండియాలోని ఖరీదైన కార్లలో ఒకటి. 2007వ సంవత్సరంలో అది అమితాబ్ గ్యారేజీలోకి చేరింది. ఏకలవ్య సినిమా‌లో అమితాబ్ బచ్చన్ నటనకు ఫిదా అయిన నిర్మాత విధు వినోద్ చోప్పా.. ఈ కాస్ట్‌లీ కారును బిగ్ బీకి గిఫ్ట్‌గా ఇచ్చారు. అప్పటి నుంచి అది అమితాబ్ వద్దే ఉంది. దీని ఖరీదు అప్పట్లోనే రూ.3.5కోట్ల పైమాటే.

    amitabh bachchan, rolls royce, amitabh bachchan cars, amitabh bachchan car collection, cars owned by amitabh bachchan, rolls royce india, rolls royce phantom, amitabh bachchan rolls royce price, Amitabh Bachchan sold car, అమితాబ్ బచ్చన్, రోల్స్ రాయిస్, అమితాబ్ బచ్చన్ కారు, అమితాబ్ బచ్చన్ కార్లు, అమితాబ్ బచ్చన్ కార్ల కలెక్షన్, రోల్స్ రాయిస్ పాంథమ్
    రోల్స్ రాయిస్ (Image:Reuters)




    రోల్స్ రాయిస్ కారును అమితాబ్ స్వయంగా నడిపేవారు. ఆయన ఎప్పుడు రోల్స్‌రాయిస్‌లో కనిపించినా.. స్టీరింగ్ ముందే ఉండేవారు. అప్పుడప్పుడు కుటుంబంతో కలసి వెళ్లినా కూడా తానే స్వయంగా డ్రైవ్ చేసేవారు. ఈ కారంటే బిగ్ బచ్చన్‌కి అంత ఇష్టం. అయితే, ఇది లగ్జరీ కారు అయినప్పటికీ.. మరింత అప్ డేటెడ్ వెర్షన్ కారును కొనుగోలు చేసేందుకు దీన్ని అమ్మేశారని భావిస్తున్నారు.
    First published:March 03, 2019, 21:57 IST