77 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ చేసిన పనికి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..

వయసు మీద పడుతున్న ఇప్పటికీ అమితాబ్ బచ్చన్... కుర్ర హీరోలకు ధీటుగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. రీసెంట్‌గా అమితాబ్ బచ్చన్ 77వ పుట్టినరోజు జరుపుకున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: December 3, 2019, 1:14 PM IST
77 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ చేసిన పనికి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..
అమితాబ్ బచ్చన్ (Instagram/Photo)
  • Share this:
వయసు మీద పడుతున్న ఇప్పటికీ అమితాబ్ బచ్చన్... కుర్ర హీరోలకు ధీటుగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. రీసెంట్‌గా అమితాబ్ బచ్చన్ 77వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ వయసులో సాధారణంగా చాలా మంది కృష్ణ రామా అంటూ ఏదో మూలన ఇంట్లో కూర్చుంటారు. కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఇప్పటికే సినిమా కోసం ఏమి చేయడానికైనా వెనకాడటం లేదు. రీసెంట్‌గా ఆయన అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు వైద్యులు ఆయన్ని సినిమాలు పక్కనపెట్టి విశ్రాంతి తీసుకోమని సలహా కూడా ఇచ్చారు. కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఇప్పటికే కమిటైన సినిమాలను పూర్తి చేయడంపై దృష్టి సారించారు. డాక్టర్లు వద్దని వారిస్తున్న అతి శీతల ప్రదేశమైన హిమాచల్ ప్రదేశ్‌లోని కులు మనాలిలో... మైనస్ 3 డిగ్రీ చలిలో ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో వెల్లడించారు. గడ్డకట్టే చలిలో సినిమా షూటింగ్ జరుగుతోందంటూ రాసారు.


View this post on Instagram

.. the minus degrees .. the biting cold .. and the protective gear ..


A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

ముందుగా మనకొచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చామా లేదా అన్నది ముఖ్యమన్నారు. ఆరోగ్యం అంతగా సహకరించక పోయినా.. ఇచ్చిన డేట్స్ ప్రకారం అమితాబ్.. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీంతో వృత్తి పట్ల ఆయనకున్న నిబద్దతను నెటిజన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా కొనియాడుతున్నారు. ‘బ్రహ్మస్త్ర’ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో,హీరోయిన్లుగా ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఈ సినిమాలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 3, 2019, 1:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading