Home /News /movies /

AMITABH BACHCHAN SHOCKING ABOUT A WATERFALL IN SIKKIM IN HIS NAME TA

Big B: అమితాబ్ బచ్చన్ షాక్ అయిన వేళ..

అమితాబ్ బచ్చన్ (File/Photo)

అమితాబ్ బచ్చన్ (File/Photo)

అమితాబ్ బచ్చన్ ఒక నెటిజన్ చేసిన పనికి ఆశ్చర్యపోయాడు. వివరాల్లోకి వెళితే.. 

    అమితాబ్ బచ్చన్ ఒక నెటిజన్ చేసిన పనికి ఆశ్చర్యపోయాడు. వివరాల్లోకి వెళితే..  మన దేశంలోని ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకత సిక్కింకు ఉంది.  ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన సిక్కిం రాష్ట్రంలో ఒక ఎత్తైన జలపాతం ఉంది. ఆ జలపాతానికి ‘అమితాబ్ బచ్చన్ వాటర్ ఫాల్స్ అనే పేరుంది. ఇది నార్త్ సిక్కి జిల్లాలోని లాచుంగ్ ప్రాంతంలో ఉంది. దీని అసలు పేరు భీవ్మా. అప్పట్లో అమితాబ్ నటించిన ‘ఆంఖే’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను  చాలా రోజుల పాటు భీవ్మా వాటర్ ఫాల్స్ వద్ద చిత్రీకరించారు. అప్పటి నుంచి ఈ జలపాతానికి స్థానికులు, పర్యాటకులు ఆ జలపాతాన్ని ‘అమితాబ్ బచ్చన్ వాటర్ ఫాల్స్’ అని పిలవడం ప్రారంభించడం మొదలుపెట్టారు. ఐతే ఈ విషయం అమితాబ్ బచ్చన్‌కు ఇప్పటివరకు తెలియదట. ఓ అభిమాని ట్వీట్‌తో తన పేరు మీదున్న జలపాతం తెలుసుకొని అమితాబ్ బచ్చన్ ఎంతో ఆశ్చర్యానికీ గురయ్యడు. ఓ నెటిజన్ ఆ జలపాతం ముందు ఫోటో దిగి.. బిగ్‌బికి ట్యాగ్ చేశాడు. దీనికి బచ్చన్ రీ ట్వీట్ చేస్తూ ఇది నిజం కాదు.


    అది జలపాతం పేరు  అని చెప్పాడు.  ఈ జలపాతంతో పాటు సింగపూర్‌లోని ఓ ఆర్కిడ్ జాతి మొక్కకూ బిగ్‌బీ పేరు పెట్టారట.
    First published:

    Tags: Amitabh bachchan, Big B, Bollywood, Hindi Cinema, Sikkim

    తదుపరి వార్తలు