హోమ్ /వార్తలు /సినిమా /

Kangana Ranaut: కంగానపై పోస్టు పెట్టి వెంటనే డిలీట్ చేసిన అమితాబ్.. ఏమైంది?

Kangana Ranaut: కంగానపై పోస్టు పెట్టి వెంటనే డిలీట్ చేసిన అమితాబ్.. ఏమైంది?

ఇటీవలి ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత మహారాజ్ యోగి ఆదిత్యనాథ్ జీని కలుసుకునే గొప్ప అదృష్టం ఈ రోజు నాకు కలిగిందని అన్నారు.

ఇటీవలి ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత మహారాజ్ యోగి ఆదిత్యనాథ్ జీని కలుసుకునే గొప్ప అదృష్టం ఈ రోజు నాకు కలిగిందని అన్నారు.

కంగనాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. పోస్టు పెట్టిన అమితాబ్... కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు. దీంతో ఆయన ఎందుకలా చేశారంటూ.. ఇప్పుడు నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.

  కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ ఏదో వార్తలతో ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉంటుంది. కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut) లీడ్ రోల్‌లో న‌టిస్తున్న చిత్రం ధాక‌డ్ (Dhaakad).ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్లో కంగ‌నా ఏజెంట్ అగ్ని పాత్ర‌లో ఫుల్ యాక్ష‌న్ మోడ్‌లో అన్ స్టాప‌బుల్ మిష‌న్‌తో అద‌ర‌గొడుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) ధాక‌డ్ నుంచి (She’s on Fire song) సాంగ్ ప్రోమో సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ..కంగ‌నార‌నౌత్‌, దివ్యాద‌త్తా, అర్జున్ రాంపాల్‌, ఇత‌న యూనిట్ మెంబ‌ర్స్ కు గుడ్ ల‌క్ చెప్పాడు.

  అయితే బిగ్ బీ ఇలా పోస్ట్ పెట్టిన కొద్దిసేప‌టికే దాన్ని డిలీట్ చేశాడు. దీంతో నెటిజన్స్ అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. అమితాబ్ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆ పోస్టును డిలీట్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. బిగ్ బీ సడెన్ గా ఎందుకు అలా పోస్టు డిలీట్ చేశారని పలువురు చర్చించుకుంటున్నారు. అమితాబ్ ఎందుకు కంగనా సాంగ్‌ను డిలీట్ చేశారని విషయం ఏమై ఉంటుందని నెటిజన్స్,కంగనా అభిమానులు జోరుగా డిస్కషన్ పెట్టుకుంటున్నారు. మ‌రి అమితాబ్ బ‌చ్చ‌న్ కంగనా సాంగ్ ప్రోమోను షేర్ చేసిన‌ట్టే చేసి..ఎందుకు డిలీట్ చేశాడ‌నేదానిపై ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

  మరోవైపు కంగనా.. బాద్ షా కంపోజ్ చేసిన ఈ పాట‌ షూటింగ్ అదిరిపోయేలా జ‌రిగిందని తెలిపింది. ఏజెంట్ అగ్ని ప‌వ‌ర్, మిష‌న్‌లో ఎలా పాల్గొన్న‌ది..త‌న ల‌క్ష్యాన్ని చేరుకున్న‌ద‌నేది పాట ప్ర‌తిబింబిస్తుంద‌ని కంగ‌నా చెప్పుకొచ్చింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో వ‌స్తున్న ఈ చిత్రాన్ని ర‌జ‌నీష్ ఘాయ్ (Razneesh Ghai) డైరెక్ట్ చేస్తున్నాడు. మే 20న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. మరోవైపు పాట రేపు విడుదల కానుంది.

  ఈ పాటపై పనిచేసిన బాద్షా మాట్లాడుతూ, “పాటకు సంక్షిప్తంగా ఒక ట్యూన్ కంపోజ్ చేయడం ఆకట్టుకునేలా ఉంటుంది, అయితే సినిమా యొక్క సారాంశాన్ని పట్టుకుని, దాని ప్రధాన పాత్రల స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ఈ పాట  టైటిల్ ఏజెంట్ అగ్ని మరియు చిత్రంలో తన మిషన్ ద్వారా ఆమె శక్తినిచ్చే విధానం ఆధారంగా రూపొందించబడింది. రాంపాల్ భయంకరమైన విలన్‌గా నటించాడు. ఈ పాట వారిద్దరినీ ఒకరితో ఒకరు ఎదుర్కొనేలా కనిపిస్తుందని బాద్షా తెలిపారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Amitabh bachchan, Bollywood, Kangana Ranaut

  ఉత్తమ కథలు