• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • AMITABH BACHCHAN SHARES AN UPDATE ON HIS HEALTH CONDITION WRITES ABOUT UNDERGOING A SURGERY HERE ARE THE DETAILS SR

Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్‌కు మరోసారి శస్త్ర చికిత్స.. అందోళనలో ఫ్యాన్స్..

Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్‌కు మరోసారి శస్త్ర చికిత్స.. అందోళనలో ఫ్యాన్స్..

Amitabh Bachchan Photo : Twitter

Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్ మరోసారి అనారోగ్యం పాలైయారు. ఇదే ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగులో పేర్కోన్నారు.

  • Share this:
    అమితాబ్ బచ్చన్ మరోసారి అనారోగ్యం పాలైయారు. ఇదే ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగులో పేర్కోన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగాలేదని.. దీంతో శస్త్రచికిత్స చేయించుకుంటానని తెలిపారు. ఇక ఈ వార్త బయటకు వచ్చిన తరువాత, అమితాబ్ అభిమానులు చాలా కలత చెందుతున్నారు. అయితే అందోళన చెందవద్దని అంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఇక గతంలో అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బీ ఫ్యామిలీలో అందరు కరోనా నుంచి కోలుకోని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక అమితాబ్ బచ్చన్ గతంలో కూడా రెండు సార్లు ఆనారోగ్యంగా కారణంగా సర్జరీలు చేయించుకున్నారు. అయితే అభిమానలు దీవెనలు ప్రార్థనలతో  ఆరోగ్యంగా బయటపడ్డారు.  ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. వికాస్ బల్ సినిమాలో ఆయన నటించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇక ఆయన నటించిన గులాబో సీతాబో కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమా అమెజాన్‌లో డిజిటల్ ప్రీమియర్‌గా స్ట్రీమ్ అయ్యి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాను సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించాడు.

    ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం అజయ్ దేవగన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ కూడా నటిస్తుంది. మేడే పేరుతో వస్తున్న ఈ సినిమా మొన్నటి వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంది.

    Amitabh Bachchan Surgery, Amitabh Bachchan health, Amitabh Bachchan,Amitabh Bachchan blog,Amitabh Bachchan twitter,Amitabh Bachchan corona possitive,Amitabh Bachchan corona negative,Amitabh Bachchan covid negative, అమితాబ్ బచ్చన్‌, అమితాబ్ బచ్చన్‌ ఆరోగ్యం
    Amitabh Bachchan Blog Photo : tumblr.com




    ఇక సైరాత్ దర్శకుడు నాగరాజ్ మంజులే డైరెక్షన్‌‌లో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా జుండ్ జూన్ 18 న థియేటర్లలో విడుదలకానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. అయితే ఈ సినిమా కథ విషయంలో కొంత గందరగోళం ఏర్పడ్డ సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన వర్తమాన సినీ దర్శకుడు నంది చిన్ని కుమార్ జుండ్ సినిమా తాను తీయాలనుకున్న కథ ఆధారంగా తెరకెక్కిందని.. ఆ సినిమా కథ హక్కులు నా దగ్గర ఉన్నాయని కోర్టును ఆశ్రయించాడు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు