దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై అమితాబ్ రియాక్షన్ ఇది..

తాజాగా కేంద్ర ప్రభుత్వం బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్‌‌‌ను భారతీయ సినిమా రంగంలోనే అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు‌కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు తనకు దక్కడంపై అమితాబ్ బచ్చన్ స్పందించారు.

news18-telugu
Updated: September 25, 2019, 11:54 AM IST
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై అమితాబ్ రియాక్షన్ ఇది..
అమితాబ్ బచ్చన్ (Twitter/Photo)
  • Share this:
తాజాగా కేంద్ర ప్రభుత్వం బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్‌‌‌ను భారతీయ సినిమా రంగంలోనే అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు‌కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు బిగ్‌బీ వరించడంతో దేశ వ్యాప్తంగా అమితాబ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నలతో పాటు సినిమా రంగంలో పలువురు ప్రముఖలతో పాటు నెటిజన్స్ అమితాబ్‌ను అభినందంలతో ముంచెత్తున్నారు. పలువురు అభిమానులు.. అమితాబ్‌కు స్వయంగా శుభాకాంక్షలు తెలపడానికి ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఈ అవార్డు తనకు రావడంపై బిగ్‌బీ తన ఆనందాన్ని వక్త్య పరిచారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును నేను ఎంతో వినమ్రంగా స్వీకరిస్తున్నా అని చెప్పుకొచ్చారు. ఎన్నో కోట్ల ప్రజల ఆశీర్వాద బలంతోనే నేను ఈ అవార్డును స్వీకరించబోతున్నాను అంటూ చేతులు జోడించిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు.

ఈ అవార్డు సందర్భంగా  అమితాబ్ బచ్చన్‌ కేంద్రం నుంచి స్వర్ణకమలంతో పాటు శాలు.. రూ.10 లక్షల బహుమతిని అందుకోనున్నారు.
First published: September 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు