చిరంజీవి ‘సైరా’ కోసం రంగంలోకి అమితాబ్, రజినీకాంత్, మోహన్ లాల్, యశ్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు దక్షిణాదిలోని నాలుగు భాషలతో పాటు హిందీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా భాషల్లో అగ్రనటులు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: August 19, 2019, 12:45 PM IST
చిరంజీవి ‘సైరా’ కోసం రంగంలోకి అమితాబ్, రజినీకాంత్, మోహన్ లాల్, యశ్..
‘సైరా’కు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అగ్రనటులు (ఫైల్ ఫోటోస్)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించాడు. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్ర గోసాయి వెంకన్న పాత్రలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు. దీంతో ఈ సినిమాకు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. మరోవైపు సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది. మరోవైపు తమన్నా కూడా ఈ సినిమాలో నర్తకి పాత్రలో నటిస్తోంది. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా మేకింగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ,కన్నడ భాషల్లో ఏక కాలంలో  రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషల్లో క్రేజ్ తీసుకువచ్చేందకు ఇప్పటికే ఆయా భాషలకు చెందిన నటీనటులను ఈ సినిమాలో తీసుకున్నారు.

Prabhas Saaho movie Pre release business dominated Chiranjeevi Sye Raa Narasimha Reddy pk తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవిని మించిన హీరో లేడు. బడ్జెట్ లెక్కలనే కాదు.. బాక్సాఫీస్ రూపు రేఖలను మార్చేసిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మెగాస్టార్ ఒక్కడే. ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవిని దాటాలంటే కష్టమే. prabhas,chiranjeevi,saaho twitter,saaho business,saaho hindi rights,sye raa business,chiranjeevi sye raa,prabhas about chiranjeevi,prabhas,chiranjeevi,prabhas about mega star chiranjeevi,prabhas saaho,prabhas about mega star chiranjeevi's reaction on saaho,prabhas saaho trailer,prabhas about megastar chiranjeevi,prabhas about mega star chiranjeevi's reaction on saaho trailer,prabhas about mega star,prabhas about chiranjeevi reaction for saaho trailer,prabhas about mega star chiranjeevi's reaction,prabhas speech,telugu cinema,ప్రభాస్,చిరంజీవి,సాహో,సైరా,ప్రభాస్ సాహో,సాహో బిజినెస్,సైరా బిజినెస్,తెలుగు సినిమా
సైరా పోస్టర్ (Source: Facebook)


ఇప్పటికే తెలుగు వెర్షన్ టీజర్‌కు పనవ్ కళ్యాన్ వాయిస్ ఓవర్ అందించారు. తమిళంలో ‘సైరా’ టీజర్‌కు రజినీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో యశ్, హిందీలో అమితాబ్ బచ్చన్ ‌తో ఈ సినిమా టీజర్‌కు వాయిస్ ఓవర్ చెప్పించనున్నట్టు సమాచారం. మొత్తానికి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం ఆయా భాషల్లోని అగ్రనటులు రంగంలోకి దింపుతూ ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చేపనిలో ఉన్నారు చిత్ర యూనిట్.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 19, 2019, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading