లాక్ కర్దే అంటూ కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌తో అందుకున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఈ ప్రోగ్రామ్‌లో ఒక్క సీజన్ తప్పించి అన్ని సీజన్లకు బిగ్‌బీ హోస్ట్‌గా వ్యవహరించారు. రీసెంట్గా కేబీసీ 11వ సీజన్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే ఈ షోను వివిధ భాషల్లో కూడా ప్రసారమైంది. తెలుగులో నాగార్జున హోస్ట్‌గా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’గా ప్రసారం అయింది. ఆ తర్వాత చిరంజీవి కూడా తెలుగులో ఒక సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. కానీ చిరు హోస్ట్ చేసిన ప్రోగ్రామ్ మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా అమితాబ్ బచ్చన్ కేబీసీ 12వ సీజన్‌కు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశారు.మన జీవితాలకు బ్రేక్ ఉంటుంది కానీ.. మన కలలకు కాదు. మీ కలలకు కార్యరూపం దాల్చేందకు త్వరలో మీ ముందుకు రాబోతున్నాము. ఇంకెందుకు ఆలస్యం మే 9న రాత్రి 9 గంటల నుండి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్‌లో మీ పేరు వెంటనే నమోదు చేసుకోండి అని అమితాబ్ వీడియో ద్వారా తెలిపారు. అతి త్వరలో ఈ షో టీవీలో ప్రసారం కానుంది. మరి ఎందుకు ఆలస్యం వెంటనే కేబీసీ ప్రోగ్రామ్ కోసం ప్రిపేర్ కండి.
ji .. its coming back to you again soon https://t.co/rCQn2kFsOK
— Amitabh Bachchan (@SrBachchan) May 2, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Big B, Bollywood