దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించలేను.. కేంద్రానికి అమితాబ్ లేఖ..

అమితాబ్ బచ్చన్ (amitabh bachchan)

బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్‌‌కు కేంద్రం 2018 యేడాదికి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. తాజాగా బిగ్‌బీ ఈ అవార్డు వేడుకకు రాలేకపోతున్నట్టు కేంద్రానికి ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

  • Share this:
    బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్‌‌కు కేంద్రం 2018 యేడాదికి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. ఈ అవార్డు అందుకుంటున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్.  ఈ రోజు జాతీయ అవార్డులో భాగంగా కేంద్రం ఈ అవార్డులను ప్రధానం చేయనుంది. తాజాగా అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు అందుకోవడానికి  రాలేకపోతున్నట్టు ట్వట్టర్‌లో వెల్లడించారు. గత రెండు మూడు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న మూలంగా ఈ అవార్డు స్వీకరించేందుకు రాలేకపోతున్నానని బిగ్‌బీ పేర్కొన్నారు. జ్వరం కారణంగా ముంబాయి నుంచి ఢిల్లీకి ప్రయాణం చేయలేనన్నారు. జాతీయ చలన చిత్ర అవార్డులను రాష్ట్రపతి అందజేయడం ఆనవాయితీ. ఈ సారి ఈ అవార్డులను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా అందజేయనున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ అవార్డు ఉత్సవంలో పాల్గొంటారు.

    అమితాబ్ బచ్చన్ కెరీర్ స్టార్ట్ చేసిన 1969లోనే ఈ అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. అలా తన సినీ జీవితం ప్రారంభమైన యేడాదిలో మొదలైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్రం ఇవ్వడం ప్రారంభించింది. తాజాగా అమితాబ్ బచ్చన్ తన సినీ జీవితం 50 యేళ్లు పూర్తైయిన యేడాదిలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం విశేషం. ఈ అవార్డును హిందీ చిత్ర సీమ నుండి అందుకుంటున్న 32 వ్యక్తి అమితాబ్. మిగతావారు ఇతర భారతీయ భాష రంగం నుంచి ఎంపికయ్యారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: