Amitabh Bachchan Jhund : కాపీరైట్స్ వివాదంలో అమితాబ్ జుండ్..‌ కోర్టుకెక్కిన ఫిల్మ్ మేకర్..

Amitabh Bachchan : హిందీ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో స్పోర్ట్స్ జానర్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జుండ్‌’ తెలిసిందే.

news18-telugu
Updated: September 19, 2020, 9:43 AM IST
Amitabh Bachchan Jhund : కాపీరైట్స్ వివాదంలో అమితాబ్ జుండ్..‌ కోర్టుకెక్కిన ఫిల్మ్ మేకర్..
వివాదంలో జుండ్, ఫిల్మ్ మేకర్ నంది చిన్ని కుమార్ Photo : Twitter
  • Share this:
హిందీ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో స్పోర్ట్స్ జానర్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జుండ్‌’ తెలిసిందే.  సైరాత్‌తో దేశ వ్యాప్తంగా పాపులరైన నాగ్ రాజ్ మంజులే ఈ సినిమాకు దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళా... కాపీరైట్స్‌ వివాదం నెలకొన్నది. వివరాల్లోకి వెళితే.. స్లమ్‌ సాకర్‌ ఛాంపియన్‌ అఖిలేశ్‌ పాల్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తీసిన ఈ సినిమా కాపీరైట్స్‌ తన దగ్గర ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ నంది చిన్నికుమార్‌ అంటున్నాడు. పదవి విరమణ చేసిన ఒక క్రీడా ఉపాధ్యాయుడు ఒక మంచి సాకర్ టీమ్‌ను ఎలా తయారు చేశాడనే నేపథ్యంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఆ ఉపాధ్యాయుడి పాత్రలో అమితాబ్ నటించారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, సవితా రాజ్, రాజ్ హిరేమత్‌తో కలిసి దర్శకుడు నాగరాజ్ మంజులే ఈ మూవీని నిర్మించాడు.

అయితే సాకర్‌ ఛాంపియన్‌ అఖిలేష్‌ పౌల్ కోచ్ అయిన విజయ్ బర్సే జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిందని.. అయితే అఖిలేష్‌ పౌల్‌ జీవిత కథను ఫీచర్‌ ఫిల్మ్‌గా రూపొందించేందుకు అఖిలేష్‌ పౌల్‌ నుంచి రైట్స్‌ తీసుకున్నానని, 'స్లమ్‌ సాకర్‌' అనే టైటిల్‌తో చిత్రం కూడా ప్రారంభించానని చెబుతున్నాడు హైదరాబాద్ ఫిల్మ్ మేకర్‌ నంది చిన్ని కుమార్‌. అంతేకాదు ‘జుండ్‌’ చిత్ర దర్శకనిర్మాతలపై కంప్లయింట్‌ చేస్తూ.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కోర్టుని సంప్రదించాడు. ‘జుండ్‌’ చిత్రబృందం అఖిలేష్‌ పౌల్‌ కోచ్ దగ్గర రైట్స్ తీసుకుంటే, తాను అఖిలేష్‌ పౌల్‌ దగ్గరే రైట్స్‌ తీసుకున్నానని అంటున్నాడు నంది చిన్ని కుమార్. ఈ సందర్భంగా ఓ ప్రకటనను విడుదల చేసిన చిన్ని కుమార్.. కూకట్‌పల్లి కోర్ట్ తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు ‘జుండ్‌’ను ఏ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేయడానికి వీలు లేదని విడుదల చేసిన ప్రకటనలో పేర్కోన్నాడు.
Published by: Suresh Rachamalla
First published: September 19, 2020, 9:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading