news18-telugu
Updated: October 17, 2019, 10:53 PM IST
అమితాబ్ బచ్చన్ (amitabh bachchan)
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. లివర్ సంబంధిత సమస్యతో సీనియర్ బచ్చన్ ఆస్పత్రిలో చేరినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. ఈనెల 15న రాత్రి 2 గంటల సమయంలో కుటుంబసభ్యులు అమితాబ్ బచ్చన్‌ను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించినట్టు ఆ కథనంలో పేర్కొంది. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం పాపులర్ టీవీ షో కౌన్ బనేగా కరోడ్ పతి షూటింగ్ పూర్తి చేసుకుంటున్నారు. వెండి తెర మీద తాజాగా బద్లా సినిమాలో కనిపించారు. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా గోసాయి వెంకన్న పాత్రలో కనిపించారు. ఆయుష్మాన్ ఖురానాతో కలసి ‘గులాబో సితాబో’ సినిమాలో నటిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌తో కలసి ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 24న అమితాబ్ బచ్చన్‌ను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గాను భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత గొప్పదైన పురస్కారానికి సీనియర్ బచ్చన్‌ను ఎంపిక చేసింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 17, 2019, 10:39 PM IST