అమితాబ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం

బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్‌‌కు కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది.

news18-telugu
Updated: December 29, 2019, 6:22 PM IST
అమితాబ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం
Twitter/Ani
  • Share this:
బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్‌‌కు కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. దీంతో ఈ అవార్డు అందుకుంటున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్. ఈ అవార్డ్‌ను ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అమితాబ్ అందుకున్నారు.  ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ... తనను అవార్డు కోసం ఎంపిక చేసిన జ్యూరి మెంబర్లకు, ప్రసార మంత్రిత్వ శాఖకు, కేంద్ర మంత్రికి తనకు అవార్డు అందజేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన పట్ల దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండడం దీనికి కారణమైందన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. తనతో సినిమాలు తీసిన నిర్మాతలు, దర్శకులు, తోటి కళాకారులు, ఇంతగా ఆరాదించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డ్స్‌ను  కేంద్ర ప్రభుత్వం 1969వ సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించింది. అదే సంవత్సరం అమితాబ్ హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేశారు. అంతేకాదు అమితాబ్ బచ్చన్ తన సినీ జీవితం 50 యేళ్లు పూర్తైయిన యేడాదిలో ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం విశేషం.First published: December 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు