• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • AMITABH BACHCHAN HEALTH CONDITION LATEST UPDATE TA

Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై తాజా అప్‌డేట్..

Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్  ఆరోగ్యంపై తాజా అప్‌డేట్..

అమితాబ్ బచ్చన్ (Twitter/Photo)

Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. తనకు ఆరోగ్యం బాగా లేదు. అందుకోసం హాస్పిటల్‌లో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

  • Share this:
    Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. తనకు ఆరోగ్యం బాగా లేదు. అందుకోసం హాస్పిటల్‌లో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. తనకు ఆరోగ్యం బాగా లేదు. అందుకోసం హాస్పిటల్‌లో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే అందోళన చెందవద్దని అంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఇక గతంలో అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బీ ఫ్యామిలీలో అందరు కరోనా నుంచి కోలుకోని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక అమితాబ్ బచ్చన్ గతంలో కూడా రెండు సార్లు ఆనారోగ్యంగా కారణంగా సర్జరీలు చేయించుకున్నారు. 1982లో కూలీ షూటింగ్ సమయంలో సహ నటుడు పునీత్ ఇస్సార్ .. నిజంగానే అమితాబ్ బచ్చన్ డొక్కలో పొడవడంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాదాపు ఆరు నెలలకు పైగా హాస్పిటల్‌లో గడిపారు.

    ఆ తర్వాత 2005లో తీవ్రమైన కడుపునొప్పి రావడంతో మరోసారి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ సారి సాఫ్ట్ డ్రింక్స్ అధికమోతాదులో ఆయన సేవించడం మూలంగా ఆయన కాలేయం దెబ్బ తిన్నదని డాక్టర్లు పేర్కొన్నారు. ఆ తర్వాత అమితాబ్.. ప్రేక్షకుల దీవెన కారణంగా ఆ గండం నుంచి బయటపడ్డారు. తాజాగా ఆయన హాస్పటిల్‌లో జాయిన్ అవుతున్నట్టు బ్లాగ్‌లో పేర్కొన్నారు. కొన్ని రోజులు బ్లాగ్‌కు  దూరమవుతున్నట్టు  ప్రకటించారు. ప్రస్తుతం అమితాబ్‌కు కంటిలో శుక్లాలకు సంబంధించిన లేజర్ చికిత్స జరిగినట్టు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు. దీంతో బిగ్‌బీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

    Amitabh Bachchan, COVID-19 , caller tune, Delhi High Court, PIL, Trolls, Twitter, corona, india, అమితాబ్ బచ్చన్, కరోనా, కాలర్ ట్యూన్, కేంద్రం, ట్రోలింగ్, ట్విట్టర్
    Amitabh Bachchan


    ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. వికాస్ బల్ సినిమాలో ఆయన నటించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇక ఆయన నటించిన గులాబో సీతాబో కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమా అమెజాన్‌లో డిజిటల్ ప్రీమియర్‌గా స్ట్రీమ్ అయ్యి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాను సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించాడు. ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం అజయ్ దేవగన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ కూడా నటిస్తుంది. మేడే పేరుతో వస్తున్న ఈ సినిమా మొన్నటి వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంది. మరోవైపు జుండ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇంకోవైపు ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు