సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో బంధుప్రీతి గురించి చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీ మొత్తాన్ని వాళ్లే కబ్జా చేస్తున్నారని.. బయటి నుంచి వచ్చిన వాళ్లను అస్సలు ఎదగనీయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలో మరో వారసుడు కూడా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అతడే మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి తనయుడు అభిషేక్ వచ్చన్ వచ్చాడు కానీ స్టార్ కాలేకపోయాడు.
తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోలేక చిన్న సినిమాలకు పరిమితం అయిపోయాడు అభిషేక్. కానీ ఇప్పుడు మెగా వారసత్వాన్ని అందిపుచ్చుకోడానికి కూతురు కొడుకు వస్తున్నాడు. కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా ఒకప్పుడు బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలింది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది ఐశ్వర్యా రాయ్. ఇదిలా ఉంటే అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ నందా కుమారుడు అగస్త్య నందా ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నాడని తెలుస్తుంది. కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాత.
ఈయనకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ కుర్రాడి వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. కానీ బిగ్ బి మనవడు కావడంతో అగస్త్య వైపు దర్శక నిర్మాతల చూపులు పడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే అగస్త్య సోదరి.. శ్వేతా కూతురు నవ్య నవేలీ నందా మోడల్‌గా రాణిస్తుంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవలు అందించేందుకు సంస్థను ఏర్పాటు చేసింది. మొత్తానికి నెపోటిజమ్ బలంగా ఉందని వినిపిస్తున్న ఈ తరుణంలో అమితాబ్ బచ్చన్ మనవడు ఏం చేస్తాడో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Bollywood, Hindi Cinema