Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: August 2, 2020, 5:43 PM IST
అమితాబ్ బచ్చన్ (amitabh bachchan)
బాలీవుడ్ సెహన్ షా అమితాబ్ బచ్చన్ గత మూడు వారాలుగా ముంబై నానావతి హాస్పిటల్లోనే ఉన్నాడు. అక్కడే కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నాడు. ఆయనతో పాటు కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా వచ్చింది. అయితే ఇప్పటికే పాప, ఐశ్వర్యకు నయం అయిపోయింది. ఇప్పటికీ సీనియర్, జూనియర్ బచ్చన్ మాత్రం హాస్పిటల్లోనే ఉన్నారు. దాంతో అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి సమయంలో అభిషేక్ బచ్చన్ పండగ లాంటి వార్త చెప్పాడు.
తాజాగా చేసిన టెస్టులో అమితాబ్ బచ్చన్‌కు కోవిడ్ నెగిటివ్ వచ్చిందని.. ఆయన్ని డిశ్చార్జ్ చేసారని చెప్పాడు. ఇకపై ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటాడని ట్వీట్ చేసాడు జూనియర్ బచ్చన్. ఇప్పటి వరకు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేసాడు అభిషేక్ బచ్చన్. అయితే తన ఆరోగ్యం విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు జూనియర్ బచ్చన్. ఈయన కూడా కరోనా బారిన పడ్డాడు. మొత్తానికి అమితాబ్ ఇంటికి చేరుకోవడంతో ఆనందంలో మునిగిపోతున్నారు అభిమానులు.
మరోవైపు అమితాబ్ బచ్చన్ కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ట్వీట్ చేసాడు. ఆస్పత్రిలో ఉన్నపుడు కూడా తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చాడు బిగ్ బి. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. తనకు కరోనా నెగిటివ్ వచ్చిందని చెప్పిన అమితాబ్.. నయం కావడానికి తోడ్పడిన హాస్పిటల్ సిబ్బందికి.. తన ఆరోగ్యం కోస్ ప్రార్థించిన అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
Published by:
Praveen Kumar Vadla
First published:
August 2, 2020, 5:42 PM IST