పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న సినిమా బ్రహ్మాస్త్ర (Brahmastra). సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 9వ (September 9) తేదీన విడుదల చేస్తున్నారు. దీంతో ఇప్పటినుంచే చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. అయాన్ ముఖర్జీ (Ayan Mukharji) దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ నుంచి అమితాబ్ బచ్చన్ లుక్ రివీల్ చేసి చిత్రంపై ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. విడుదలైన కాసేపట్లోనే ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
ఈ మూవీలో అమితాబ్ పాత్ర పేరు గురు, వెలుగు యొక్క ఖడ్గాన్ని మోసేవాడు. ఆ క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అయ్యేలా బిగ్ బీ లుక్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది ఈ సినిమా హీరోయిన్ ఆలియా భట్. ''అమితాబ్ పాత్ర పేరు గురు, పవర్ హౌస్ లాంటి తెలివైన నాయకుడు.. జూన్ 15న బ్రహ్మాస్త్ర ట్రైలర్ విడుదల కాబోతోంది'' అని ట్వీట్ చేసి ప్రేక్షకుల్లో మరింత ఆతృత క్రియేట్ చేసింది ఆలియా.
స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) తొలిసారి జంటగా కనించనుండటం విశేషం. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌లో మౌని రాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. అన్ని దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తుండటం మరో విశేషం.
गुरू है गंगा ज्ञान की । काटे भाव का पाश
गुरू उठा ले अस्त्र जब । करे पाप का नाश
Here comes GURU⚡
BRAHMĀSTRA TRAILER OUT ON JUNE 15TH???? pic.twitter.com/Maz1AwAHqf
— Alia Bhatt (@aliaa08) June 9, 2022
రీసెంట్గా చిత్ర ప్రమోషన్స్ షురూ చేసిన బ్రహ్మాస్త్ర టీమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పర్యటించి తెలుగు ప్రేక్షకులకు సినిమా పట్ల ఆసక్తి పెంచారు. ఈ సందర్భంగా.. తెలుగు యాక్టర్స్ అందరు కూడా గొప్పవారే అంటూ టాలీవుడ్‌పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టారు రణ్‌బీర్ కపూర్. ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలనే ఆలోచన నుంచి పుట్టిన చిత్రమే ఈ బ్రహ్మస్త్ర అని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.