అమితాబ్ ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా అభిమానుల ప్రత్యేక పూజలు..

Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడటంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ఆయన ఆరోగ్యం కోసం ఆందోళన చెందుతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 12, 2020, 11:44 PM IST
అమితాబ్ ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా అభిమానుల ప్రత్యేక పూజలు..
అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు (amitabh bachchan fans puja)
  • Share this:
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడటంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ఆయన ఆరోగ్యం కోసం ఆందోళన చెందుతున్నారు. ఆయనకు త్వరగా నయం కావాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమితాబ్ ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్నారు ఫ్యాన్స్. కొందరు అభిమానులు అయితే ఏకంగా ఉపవాసాలు కూడా మొదలు పెట్టారు. అహ్మదాబాద్‌లో ఓ అభిమాని అయితే ఏకంగా అమితాబ్‌కు గుడి కట్టించాడు. అంతేకాదు తన షాప్‌కు కూడా అమితాబ్ పేరు పెట్టుకున్నాడు.

అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు (amitabh bachchan fans puja)
అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు (amitabh bachchan fans puja)

ఇప్పుడు తన అభిమాన హీరో ఆరోగ్యం బాగు పడాలని ఆయన తన కుటుంబం, సన్నిహితులతో కలిసి ప్రార్థనలు నిర్వహించాడు. ఈ ఒక్క అభిమాని మాత్రమే కాదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న బిగ్ బి ఫ్యాన్స్ అంతా తమ హీరో వెంటనే కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు. అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆ కుటుంబంలో మరో ముగ్గురు కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్.. కోడలు ఐశ్వర్యారాయ్.. మనవరాలు ఆరాధ్య కూడా కరోనా బారిన పడ్డారు.

అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు (amitabh bachchan fans puja)
అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు (amitabh bachchan fans puja)

దాంతో అభిమానులు ఒక్కసారిగా కంగారు పడుతున్నారు. బచ్చన్ కుటుంబాన్ని దేవుడు కాపాడాలని.. వాళ్లకు ఏ హానీ జరక్కుండా చూడాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. అమితాబ్ కోసం ప్రత్యేక పూజలు, ఉపవాసాలు నిర్వహిస్తున్నారు కూడా. అలాగే ముంబైలోని కండ్వాలీ ప్రాంతంలో ఉన్న మిథిలా హనుమాన్ ఆలయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కోసం మహమృతుంజయ హోమం జరిపించారు అభిమానులు.మరోవైపు తన కుటుంబం కోసం ఇంతగా తాపత్రయపడుతున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపాడు అభిషేక్ వచ్చన్. తాను, తన తండ్రి హాస్పిటల్లో ఉంటే.. భార్య బిడ్డ మాత్రం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపాడు ఛోటా బచ్చన్.
Published by: Praveen Kumar Vadla
First published: July 12, 2020, 9:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading