అమితాబ్ బచ్చన్ అభిమానులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధ పడుతున్న బిగ్‌బీ ఇపుడు కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఈయనకు టెస్ట్ నిర్వహించగా రిపోర్ట్ నెగిటివ్‌గా వచ్చింది. దీంతో అమితాబ్ బచ్చన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కోట్లాది ప్రజలు ఆయన తిరిగి కోలుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ప్రార్ధించారు. వారి ప్రార్ధనలు ఫలించి ఆయన తిరిగి కోలుకున్నారు. గతంలో కూలీ షూటింగ్ సందర్భంలో తీవ్రంగా గాయపడ్డారు అమితాబ్. అపుడు కూడా అదే తరహాలో ఆయన కోలుకోవాలని అభిమానులు మొక్కని దేవుళ్లు లేరు. ఇన్నేళ్ల తర్వాత మరోసారి అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకోని ఆయన ఆరోగ్యం కుదటపడాలని అభిమానులు పూజలు, హోమాలు సహా వారి ఎవరి మతాచారం ప్రకారం ప్రార్దనలు నిర్వహించారు. వారి ఆశీర్వద బలంతో అమితాబ్ బచ్చన్ తిరిగి కోలుకున్నారు.

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్ కొన్ని రోజుల క్రితం కౌన్ బనేగా కరోడ్ పతి కొత్త సీజన్ కోసం ఆడిషన్స్ జరిగాయి. ముంబైలోని ఓ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని జాగ్రత్తలతోనే అమితాబ్ కూడా హాజరయ్యాడు. ఆయనే ఈ సీజన్‌కు హోస్ట్ కాబట్టి వచ్చాడు అమితాబ్ బచ్చన్.ఆ సమయంలో మాస్క్‌తో పాటు శానిటైజ్ కూడా చేసుకున్నాడు ఈయన. కానీ ఎలా వచ్చిందో తెలియదు కానీ అప్పుడే అమితాబ్‌కు కరోనా వచ్చిందంటున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ కుటుంబంలో బిగ్‌బీతో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌తో పాటు మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీళ్లకు సంబంధించిన రిపోర్ట్స్ త్వరలో రానున్నాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:July 23, 2020, 17:09 IST