ఆత్మీయుడు మృతితో విచారం వ్యక్తం చేసిన అమితాబ్ బచ్చన్..

బాలీవుడ్ షెహెన్‌షా తన కెంతో ఆత్మీయుడు మృతితో తన ట్విట్టర్ ఖాతాలో  విచారం వ్యక్తం చేసారు.

news18-telugu
Updated: August 2, 2020, 7:09 AM IST
ఆత్మీయుడు మృతితో విచారం వ్యక్తం చేసిన అమితాబ్ బచ్చన్..
అమితాబ్ బచ్చన్ (File Photo)
  • Share this:
బాలీవుడ్ షెహెన్‌షా తన కెంతో ఆత్మీయుడు మృతితో తన ట్విట్టర్ ఖాతాలో  విచారం వ్యక్తం చేసారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ రాజకీయ వేత్త రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ వెన్నుదన్నుగా నిలిచిన అమర్ సింగ్  తీవ్ర అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఆయన గత కొన్ని రోజులుగా సింగపూర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన మృతిపై దేశ్ వ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఒకప్పడు అమర్ సింగ్ ఎంతో సన్నిహితంగా మెలిగిన్ అమితాబ్ బచ్చన్ ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోకు ఎలాంటి క్యాప్షన్ రాయకుండా పోస్ట్ చేసారు. అయితే ఈ ఫోటోను అమితాబ్ బచ్చన్ తనకు సన్నిహితుడైన అమర్ సింగ్‌కు గుర్తుకు తెచ్చుకొని ఈ ఫోటోను షేర్ చేసి ఉంటారని భావిస్తున్నారు.



ఈ ఫోటోలో అమితాబ్ బచ్చన్ తల దించుకొని బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో నివాళులు అర్పిస్తున్నట్టు ఉన్న ఫోటోను షేర్ చేసారు.  ఇక బిగ్‌బీ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన నానావతి హాస్పటిల్‌లో కోవిడ్-19కు చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు ఈయన కుటుంబ సభ్యులైన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్య ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా త్వరగా  కరోనా నుంచి కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ఎప్పటి కప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 2, 2020, 7:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading