
అమితాబ్ బచ్చన్ (File Photo)
కరోనా మహామ్మారి ఇపుడు మన దేశంతో పాటు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. దీనికి బీదా, గొప్ప తేడా లేదు. తాజాగా అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుటుంబాన్ని కరోనా కాటువేసింది. తాజాగా అమితాబ్‌కు చేసిన టెస్టుల్లో కరోనా నెగిటివ్ అనే రిపోర్డ్స్ వచ్చాయి. దీనిపై బిగ్‌బీ స్పందించారు.
కరోనా మహామ్మారి ఇపుడు మన దేశంతో పాటు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. దీనికి బీదా, గొప్ప తేడా లేదు. తాజాగా అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుటుంబాన్ని కరోనా కాటువేసింది. వీళ్ల ఫ్యామిలీలతో బిగ్‌బీతో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే కదా. కరోనా నేపథ్యంలో అమితాబ్ బచ్చన్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ముంబాయిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ముంబై మీడియాలో అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు కూడా సంతోషించారు. కానీ తాజాగా అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ ట్వీట్ చేసారు.
ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. పూర్తిగా నిర్లక్ష పూరితమైనవని అంటూ బిగ్‌బీ మండిపడ్డారు. ముంబై మీడియాలో ఎవరో అమితాబ్‌కు కరోనా నెగిటివ్ అనే వార్తను కావాలనే పుట్టించడమే కాదు. ఆ వార్తను వ్యాప్తి చేసారు. దీంతో మిగిలిన మీడియా సంస్థలు కూడా అది నిజమని నమ్మి అమితాబ్ బచ్పన్కు కరోనా తాజా రిపోర్ట్స్‌లో నెగిటివ్ వచ్చిందని వార్తలను కూడా ప్రసారం కూడా చేసారు. ఈ విషయమై అమితాబ్ బచ్చన్ స్వయంగా స్పందించడంతో ఆయనకు కరోనా తగ్గలేదనే విషయం రూఢీ అయింది. మొత్తంగా అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లాలని ఆయన అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:July 23, 2020, 17:43 IST