‘సైరా’ షూటింగ్‌కు సెల‌విచ్చేసిన అమితాబ్.. గురువుకు చిరంజీవి వీడ్కోలు..

చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వ‌చ్చేసింది. మ‌రో నెల రోజుల్లో మొత్తం షూట్ పూర్తి చేయ‌నున్నాడు సురేంద‌ర్ రెడ్డి. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ నుంచి అమితాబ్ బ‌చ్చ‌న్‌కు వీడ్కోలు ప‌లికారు చిత్ర‌యూనిట్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 16, 2019, 7:21 PM IST
‘సైరా’ షూటింగ్‌కు సెల‌విచ్చేసిన అమితాబ్.. గురువుకు చిరంజీవి వీడ్కోలు..
దీనిపై తర్వాత బాలయ్య కూడా చాలా సీరియస్ అయ్యాడు. అమితాబ్ బచ్చన్ అయితే ఎవడికి.. ఏం కొమ్ములు లేవు కదా అంటూ సీరియస్ అయ్యాడు కూడా. బాలయ్య సినిమాను ఒప్పుకోని అమితాబ్ బచ్చన్.. ఆ తర్వాత చిరంజీవి కోసం సైరా సినిమా చేసాడు. అందులో గోసై వెంకన్న పాత్రలో నటించాడు. అది చిరుతో ఆయనకున్న అనుబంధమే కారణం.
  • Share this:
చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వ‌చ్చేసింది. మ‌రో నెల రోజుల్లో మొత్తం షూట్ పూర్తి చేయ‌నున్నాడు సురేంద‌ర్ రెడ్డి. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ నుంచి అమితాబ్ బ‌చ్చ‌న్‌కు వీడ్కోలు ప‌లికారు చిత్ర‌యూనిట్. తాజాగా ఈయ‌న పార్ట్ ముగియ‌డంతో ఆయ‌న‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌క‌డ‌మే కాకుండా అమితాబ్ బ‌చ్చ‌న్ ఫోటోలు షేర్ చేసి.. సోష‌ల్ మీడియాను షేక్ చేసారు చిత్ర‌యూనిట్. సుదీప్ తో పాటు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి కూడా బిగ్ బి ఫోటోను షేర్ చేసాడు.
హాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి. ఒక్క‌సారి షూటింగ్ పూర్తైన త‌ర్వాత కేవ‌లం పోస్ట్ ప్రొడక్షన్స్ కోస‌మే నాలుగు నెల‌లు కూర్చోబోతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ద‌స‌రాకు సినిమా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. క‌చ్చితంగా అప్పుడే విడుద‌ల కావాల‌ని క‌న్ఫ‌ర్మ్ చేసాడు చిరంజీవి. దాంతో షూటింగ్ లో కూడా వేగం పెంచేసాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. తాజాగా అమితాబ్ బ‌చ్చ‌న్ పార్ట్ పూర్తి చేసి ఆయ‌న్ని ముంబైకి పంపించేస్తున్నారు.ఈ సంద‌ర్భంగా అంతా ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాము అంటూ అటు సుదీప్.. ఇటు సురేంద‌ర్ రెడ్డి పెట్టిన ఫోటోలు ఇప్పుడు బాగానే వైర‌ల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త‌మ‌న్నా, న‌య‌న‌తార న‌టిస్తుండ‌గా.. ఆయ‌న గురువుగా అమితాబ్ న‌టిస్తున్నాడు. ఇక విజయ్ సేతుపతి, సుదీప్ కిచ్చ, జ‌గ‌ప‌తిబాబు లాంటి వాళ్లు కూడా ఈ చిత్రంలో ఉన్నారు. 200 కోట్ల‌తో కొణిదెల బ్యాన‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ సైరా సినిమాను నిర్మిస్తున్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: March 16, 2019, 7:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading