అమితాబ్ బచ్చన్ దాతృత్వం.. 2100 బిహార్ రైతులను ఆదుకున్న బిగ్‌బీ..

తెరపైనే హీరోయిజం కాదు. తెర వెనక హీరోయిజం చూపించే అతి కొంది మంది నటుల్లో బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్ ఒకరు. ఇప్పటి వరకు ఎంతో మందికి ఎన్నో విధాల ఆదుకున్న బిగ్‌బీ తాజాగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకొని వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.

news18-telugu
Updated: June 13, 2019, 8:29 AM IST
అమితాబ్ బచ్చన్ దాతృత్వం.. 2100 బిహార్ రైతులను ఆదుకున్న బిగ్‌బీ..
అమితాబ్ బచ్చన్
  • Share this:
తెరపైనే హీరోయిజం కాదు. తెర వెనక హీరోయిజం చూపించే అతి కొంది మంది నటుల్లో బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్ ఒకరు. ఇప్పటి వరకు ఎంతో మందికి ఎన్నో విధాల ఆదుకున్న బిగ్‌బీ తాజాగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకొని వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. తాజాగా అమితాబ్.. బిహార్‌లోని 2,100 మంది రైతులను రుణ విముక్తులను చేసాడు. ఈ విషయాన్ని బిగ్‌బీ తన బ్లాగ్‌లో వెల్లడించారు. నేనిచ్చిన మాట ప్రకారం.. బిహార్‌లో అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న రైతుల్లో రెండు వేల మందిని ఎంపిక చేసి వారందరి అప్పులు తీర్చినట్టు చెప్పారు. కొందరికి నేరుగా బ్యాంకుల్లో వేస్తే.. మరికొందరికి స్వయంగా తన ఇంటికి పిలిచించి మరి చెక్కులను తన కూతురు శ్వేత, కొడుకు అభిషేక్ బచ్చన్‌ల ద్వారా అందజేసారు. అంతేకాదు పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాన్ని త్వరలోనే  ఆదుకోనున్నట్టు చెప్పారు.

తెరపైనే హీరోయిజం కాదు. తెర వెనక హీరోయిజం చూపించే అతి కొంది మంది నటుల్లో బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్ ఒకరు. ఇప్పటి వరకు ఎంతో మందికి ఎన్నో విధాల ఆదుకున్న బిగ్‌బీ తాజాగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకొని వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.
బిగ్ బీ పెద్ద మనసు

అంతకు ముందు అమితాబ్ వచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌పతి  సీజన్-10కు సంబంధించి ముంబైలో జరిగిన ఈవెంట్‌లో అమర జవాన్లకు సంబంధించి 44 కుటుంబాలకు కోటీ రూపాయాల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి దేశానికి వెన్నుముక అయిన రైతులు, సిపాయిలకు తమ వంతు సాయం చేస్తూ అమితాబ్  నిజంగానే రియల్ హీరో అనిపించుకుంటున్నారు.

First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...