మెగాస్టార్ చిరంజీవికి ఆల్ ఇండియా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫోన్ చేసి అభినందించారు. ఇక చిరంజీవి.. కరోనా లాక్డౌన్ కారణంగా పనులు లేకుండా పోయిన కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఛారిటీకి బాలకృష్ణ,ప్రభాస్,మహేష్, ఎన్టీఆర్‌తో పాటు మెగా హీరోలు మిగతా హీరోలు టెక్నిషియన్స్, నిర్మాతలు, దర్శకులు తమ వంతు విరాళాలు అందజేసారు. సినీ కార్మికులను ఆదుకునేందుకు సీసీసీ మెంబర్స్ చాలా కష్టపడుతున్నారు. ఈ మంగళవారం వెయ్యి మంది సినీ కార్మికులకు ఈ ఛారిటీ తరుపున నిత్యావసరాలు అందజేసినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు వచ్చి ఈ పని చేశారని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రకంగా పంపణిీ చేసే విధానం తెలుసుకున్న అమితాబ్ బచ్చన్ చిరంజీవికి ఫోన్ చేసి అభినందించినట్టు చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కరోనా క్రైసిస్ ఛారిటీలో కార్మికులకు సరుకులు చేరవేయడంతో ముందున్న తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, మెహర్ రమేష్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అమితాబ్ బచ్చన్ విషయానికొస్తే.. ఈయన చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఉయ్యాలవాడ గురువు పాత్రలో నటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Chiranjeevi, Coronavirus, Covid-19, Tollywood