గత కొన్నిరోజులుగా కరోనాపై పోరాడిన అమితాబ్ బచ్చన్.. కోవిడ్ 19పై పోరాడి గెలిచారు. ఆ తర్వాత 14 రోజులుకు పైగా హోం క్వారంటైన్లో ఉండి పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నారు. దీంతో ఆయన యథావిధిగా మళ్లీ షూటింగ్స్ మొదలు పెట్టాడు. అందులో భాగంగా కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 12 షూటింగ్లో పాల్గొన్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసారు. గతంలో కేబీసీ షూటింగ్ చేస్తున్న సమయంలో అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. బిగ్‌బీ కరోనా బారిన పడటంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులైన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్యర్యా రాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత కుటుంబం మొత్తం కరోనా నుంచి కోలుకున్నారు.తాజాగా కేబీసీ 12 సీజన్ షూటింగ్‌ను కోవిడ్ -19 నియమ నిబంధలను అనుసరిస్తూ షూటింగ్ ప్రారంభించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా కేబీసీ ఈ యేడాది 20 యేళ్లు పూర్తి చేసుకోబోతుందని గుర్తు చేసుకనుక్నారు. ఈ సందర్భంగా సెట్లో బ్లూ కలర్ పీపీఈ కిట్స్ ధరించిన వారితో కలిసి షూటింగ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కేబీసీతో తనకు ప్రేక్షకుల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:August 24, 2020, 11:51 IST