బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడి 10 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. ముంబై లీలావతి హాస్పిటల్లోనే కొడుకుతో పాటు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అమితాబ్. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య కూడా కరోనా బారిన పడ్డారు. అయితే ఇప్పటికే ఐశ్వర్య. ఆరాధ్య కోలుకున్నారు కూడా. కానీ తండ్రీ కొడుకులు మాత్రం ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు అభిమానులు.

అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు (amitabh bachchan fans puja)
దేశవ్యాప్తంగా ఉన్న బిగ్ బి ఫ్యాన్స్ వ్రతాలు, యజ్ఞాలు చేస్తూ త్వరగా మీరు కోలుకుంటారని ఆశిస్తున్నారు. అయితే కొందరు మాత్రం అమితాబ్ బచ్చన్‌పై ట్రోలింగ్ చేస్తున్నారు. అమితాబ్ కరోనాతో చచ్చిపోతాడంటూ వాళ్లు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై చాలా సీరియస్ అయ్యాడు బిగ్ బి. హాస్పిటల్ నుంచి ఆ ట్రోలర్స్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఏకంగా ఓ బహిరంగ లేఖ రాసాడు. ఇదిప్పుడు వైరల్ అవుతుంది.

అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌కి కరోనా పాజిటివ్ (File)
అందులో ఇలా రాసాడు అమితాబ్ బచ్చన్.. ‘నీ వివరాలు కూడా వెల్లడించని ఓ వ్యక్తి.. నేను చచ్చిపోవాలని కోరుకున్న నువ్వు కనీసం నీ తండ్రి పేరు కూడా రాయలేదు.. అంటే నీకు నీ తండ్రి ఎవరో తెలియదన్నమాట.. ఇప్పుడు రెండు విషయాలు మాత్రమే జరిగే ఆస్కారం ఉంది. ఒకటి నేను మరణించడం... లేదంటే బతకడం. చచ్చిపోయాను అనుకో ఇకపై ఎలాంటి సెలబ్రిటిని కూడా నువ్వు ఇలాంటి విమర్శలు చేయలేవు.. అలా కాదని దేవుడి దయ వల్ల నేను బతికానే అనుకో నీవు పెద్ద తుపానును ఎదుర్కొవాల్సి వస్తుంది. దాదాపు 90 మిలియన్ల మంది నీపై దాడి చేస్తారు.. దానికి సిద్ధంగా ఉండు. నేను దీని గురించి ఇంకా వాళ్లకు చెప్పలేదు. వాళ్ల కోపం మొత్తం ప్రపంచాన్ని దాటుతుందని గుర్తు పెట్టుకో.. పశ్చిమం నుంచి తూర్పుకు.. ఉత్తర నుంచి దక్షిణానికి వాళ్ల కోపం కట్టలు తెంచుకుంటే.. నిన్ను తన్నమని ఒక్క మాట వాళ్లకు చెప్తే.. ప్రపంచం అంతా విస్తరించిన ఈ కుటుంబం.. ఓ నిర్మూలన కుటంబంగా మారుతుంది జాగ్రత్త అంటూ సీరియస్ అయ్యాడు అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం ఈయన రాసిన లేఖతో పాటు అమితాబ్ చనిపోవాలని కోరుకున్న వ్యక్తిని కూడా బండ బూతులు తిడుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికీ ముంబై లీలావతిలో చికిత్స తీసుకుంటున్నాడు అమితాబ్ బచ్చన్.
Published by:Praveen Kumar Vadla
First published:July 28, 2020, 19:39 IST